![]() |
![]() |
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘ఓజి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈనేపథ్యంలో 21న ‘ఓజి కాన్సర్ట్’ పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు మేకర్స్. ఇదే రోజు ఉదయం ‘ఓజి’ ట్రైలర్‌ను రిలీజ్ చేస్తామని మొదట ప్రకటించారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూశారు. కానీ, మేకర్స్ తాజాగా చేసిన ప్రకటన పవర్‌స్టార్ ఫ్యాన్స్‌ని ఆగ్రహానికి గురి చేసింది. ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎంతో ఈగర్‌గా వెయిట్ చేసిన అభిమానులకు ట్రైలర్‌ను వాయిదా వేశారన్న వార్త టెన్షన్‌కి గురి చేసింది. ఆదివారం సాయంత్రం జరిగే ఈవెంట్‌లోనే ట్రైలర్ విడుదలవుతుందని ప్రకటించడంతో మేకర్స్‌పై విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు ఫ్యాన్స్.
ఆదివారం ఉదయం ట్రైలర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఈవెంట్‌లోనే ట్రైలర్ అని ఎంతో కూల్‌గా చెప్పారంటూ మేకర్స్‌ని సోషల్ మీడియాలో ఉతికి ఆరేస్తున్నారు. ‘ఇది చాలా పాపం రా.. ఫ్యాన్స్‌ని ఇలా హర్ట్ చెయ్యడం కరెక్ట్ కాదురా..’, ‘ట్రైలర్‌ని రిలీజ్ రోజు థియేటర్‌లోనే వెయ్యండి ఇంకెందుకు..’, ‘చివరి క్షణంలో ఇలా చేస్తారని మేం ఊహించాం..’ అంటూ రకరకాల కామెంట్స్‌తో తమ అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు పవర్‌స్టార్ ఫ్యాన్స్. ట్రైలర్ విషయంలో ఫ్యాన్స్ హర్ట్ అయిన విధానం చూస్తుంటే.. సినిమా కోసం వారు ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది.
![]() |
![]() |