![]() |
![]() |

విక్టరీ వెంకటేష్(venkatesh)కి సరైన హిట్ పడితే ఎలా ఉంటుందో, 'సంక్రాంతికి వస్తున్నాం' మరోసారి నిరూపించింది. 'ఎనీ సెంటర్ సింగల్ హ్యాండ్' అనే రీతిలో విడుదలైన ప్రతి సెంటర్ లోను, కలెక్షన్స్ సునామీని సృష్టించి 350 కోట్లని రాబట్టింది. మూడున్నర దశాబ్దాల వెంకటేష్ సినీ కెరీర్ లో హయ్యస్ట్ కలెక్షన్స్ ని రాబట్టిన మూవీ గా నిలిచి, వెంకటేష్ తదుపరి చిత్రంపై భారీ అంచనాలని ఏర్పాటు చేసింది. అందుకు తగ్గట్టే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram Srinivas)తో వెంకటేష్ తన తదుపరి చిత్రం చేస్తున్నాడు. దీన్ని బట్టి అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు.
ఈ చిత్రం కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో అధికారంగా ప్రారంభమైంది. అక్టోబరు 6 నుంచి సెట్స్‌పైకి వెళ్లనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ గా త్రిష, మీనాక్షిచౌదరి వంటి హీరోయిన్ ల పేర్లు బయటకి వచ్చాయి. రీసెంట్ గా చిత్ర యూనిట్ 'శ్రీనిధి శెట్టి'(Srinidhi Shetty)పేరుని ఖరారు చేసారని, త్వరలోనే అధికార ప్రకటన రానుందనే టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కన్నడ సినీ పరిశ్రమకి చెందిన శ్రీనిధి శెట్టికి క్యారక్టర్ కి తగ్గ పెర్ఫార్మ్ చెయ్యడంలో శ్రీనిధి శెట్టి స్పెషాలిటీ. లక్కీ హీరోయిన్ గా ఇండస్ట్రీ వర్గాల్లోను, ప్రేక్షకుల్లోను ప్రత్యేక గుర్తింపు పొందింది. కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 , నాని హిట్ 3 వంటి చిత్రాలే ఒక ఉదాహరణ.
దీంతో వెంకటేష్, శ్రీనిధి శెట్టి ఫెయిర్ సిల్వర్ స్క్రీన్ పై చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. ఇక గతంలో వెంకటేష్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరికి త్రివిక్రమ్ నే మాటలు అందించాడు. దీంతో ఈ ఇద్దరి కాంబో పై భారీ అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై సూర్యదేవర రాధాకృష్ణ, నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
.webp)
![]() |
![]() |