![]() |

భారతీయ చిత్ర పరిశ్రమకి సవాలు విసిరే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సవాలు విసిరిన అరుదైన మలయాళ చిత్రమే 'లోక చాప్టర్ 1 '(Lokah Chapter 1).తెలుగులో 'కొత్త లోక చాప్టర్ 1 'పేరుతో విడుదలైంది. కథ, కథనాలు, సాంకేతికత పరంగా ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. మలయాళంలో ఆగష్టు 28 , తెలుగులో ఆగస్టు 29 , తమిళం ఆగస్టు 30 , హిందీ సెప్టెంబర్ 4 న విడుదలైంది.
ఇక ఈ చిత్రం ఇప్పటి వరకు 267 కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు నిర్దారించాయి. దీంతో మలయాళ చిత్ర పరిశమ్రలో అత్యధిక వసూలు చిత్రంగా 'కొత్త లోక' నిలిచింది. గతంలో ఈ రికార్డు 265 . 5 కోట్లతో మోహన్ లాల్, పృథ్వీ రాజ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'ఎల్ 2 ఎంపురాన్' పై ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని 'కొత్త లోక' ఆక్రమించినట్లయింది. 242 కోట్లతో 'తుడురమ్' మూడవ స్థానంలో ఉంది. 'కొత్తలోక' ని ప్రముఖ అగ్ర హీరో 'దుల్కర్ సల్మాన్' సుమారు 30 కోట్ల వ్యయంతో నిర్మించాడు. రెగ్యులర్ హీరో లేకుండా కేవలం 'కళ్యాణి ప్రియదర్శన్'(Kalyani priyadarshan)తో లేడీ ఓరియెంటెడ్ సబ్జెట్ కి ముప్పై కోట్లు పెట్టడంపై అందరు ఆశ్చర్య పోయారు. కానీ దుల్కర్ కథని,దర్శకుడ్ని నమ్మి ఎంతో డేర్ గా నిర్మించాడు. అసలు 'కొత్తలోక' సినిమా చూసిన వాళ్ళకి 30 కోట్లు కాకుండా, అంతకి డబుల్ ఖర్చుతో నిర్మించారని అనుకుంటారు. మూవీ అంత గ్రాండ్ గా ఉంటుంది. అందుకే ఇండియన్ సినిమా పరిశ్రమకి సరికొత్త సవాలు విసిరిందనే మాటలు సోషల్ మీడియాలోతో పాటు పరిశ్రమ వర్గాల్లో వినపడుతున్నాయి.
పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న 'యక్షి' అనే ఒక ఆడ రాక్షసికి, ప్రస్తుతం జరిగే కథకి సంబంధం ఏంటనే ఒక వినూత్నమైన పాయింట్ తో 'కొత్తలోక' తెరకెక్కింది. స్క్రీన్ ప్లే మన కంటిని పక్కకి కూడా తిప్పుకోనివ్వదు. కళ్యాణి ప్రియదర్శన్ తో పాటు ప్రేమలు ఫేమ్ నస్లీన్, శాండీ మాస్టర్ ప్రధాన పాత్రలు పోషించగా, డొమనిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు.
![]() |