![]() |
![]() |

రీసెంట్ గా 'దక్ష' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ నటి మంచు లక్ష్మికి ఊహించని ప్రశ్న ఎదురైన సంగతి తెలిసిందే. "50 ఏళ్లకు దగ్గరవుతున్న మీరు.. ఇలాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు?" అంటూ జర్నలిస్ట్ మూర్తి ప్రశ్నించారు. ఇంటర్వ్యూలోనే ఈ ప్రశ్నపై అసహనం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి.. అంతటితో ఈ విషయాన్ని విడిచి పెట్టకుండా.. జర్నలిస్ట్ మూర్తిపై ఫిల్మ్ ఛాంబర్‌కి కూడా ఫిర్యాదు చేశారు. (Manchu Lakshmi)
ఆ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మికి ఎదురైన అనుభవంపై తాజాగా సీనియర్ నటి హేమ స్పందించారు. జర్నలిస్ట్ మూర్తి తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సొంత సిస్టర్ కే ఇలాంటి పరిస్థితి వస్తే.. మిగతా చిన్న ఆర్టిస్ట్ ల పరిస్థితి ఏంటని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. (Actress Hema)
"జర్నలిస్ట్ లు అంటే చదువుకున్నవారు, సంస్కారవంతులు కదా. మరి మీరు అడుగుతున్న ప్రశ్నలేంటి?. మూర్తి గారు.. అసలు ఆ క్వశ్చన్ ఏంటి? బాడీ షేమింగ్ చేస్తారా? ఏది అడగాలి, ఏది అడగకూడదో తెలియదా. సుమ గారు ఒక ఈవెంట్ లో సరదాగా టిఫిన్ ని భోజనంలా చేయకండి అంటేనే.. ఆమెపై ఓ జర్నలిస్ట్ సీరియస్ అయ్యారు కదా. ఆమెతో సారీ కూడా చెప్పించుకున్నారు. మరి మీరు నోటికి ఏదొస్తే అది అడుగుతారా? మూర్తి గారు అలాంటి ప్రశ్న అడిగితే.. మిగతా జర్నలిస్ట్ లు ఎందుకు ఖండించడంలేదు. మంచు లక్ష్మి గారు ఆ ప్రశ్న వల్ల ఇబ్బంది పడితే.. అసలు దానిని ఛానల్ వాళ్ళు ఎలా టెలికాస్ట్ చేస్తారు?. ఇంత జరుగుతుంటే మా అసోసియేషన్ ఎందుకు రియాక్ట్ కావట్లేదు. మా ప్రెసిడెంట్ సిస్టర్ కే ఈ పరిస్థితి అంటే.. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి. మా అసోషియన్, ఫిలిం ఛాంబర్ వెంటనే స్పందించి.. దీనిపై న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాను." అంటూ హేమ ఒక వీడియోను విడుదల చేశారు.
![]() |
![]() |