![]() |
![]() |

నటుడిగా, నిర్మాతగా కంటే కూడా తన స్పీచ్ లతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు బండ్ల గణేష్. ఇప్పుడు మరోసారి సంచలన కామెంట్స్ తో హాట్ టాపిక్ గా నిలిచారు. తాజాగా 'లిటిల్ హార్ట్స్' సక్సెస్ మీట్ లో పాల్గొన్న బండ్ల.. ఇండస్ట్రీలో మాఫియా ఉందని, మాయ మాటలతో ముంచేస్తుంది అంటూ హీరో మౌళిని హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. (Bandla Ganesh)
మాఫియా మనల్ని బతకనివ్వదు
"మౌళి నీకో మాట చెబుతాను. ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం. ఈ సినిమా రిలీజ్ కి ముందురోజు ఉన్నట్టుగానే నువ్వు ఉండు. నాలాంటోడు నీ దగ్గరకు వచ్చి.. మౌళి గారు మీ ముందు మహేష్ బాబు, విజయ్ దేవరకొండ ఏం పనికొస్తారని అంటాడు. అవన్నీ నమ్మకు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నాను. ఆ లెజెండరీ యాక్టర్ లాగా సినిమాలు చేయాలి. మీ గాజువాక బేస్ ని మర్చిపోకు. ఈ ఫిల్మ్ నగర్, ఈ ట్వీట్లు, ఈ ఫొటోలు, ఈ పొగడ్తలు.. ఇదంతా అబద్ధం. వాస్తవంలో ఉండు. లేకపోతే మనల్ని బతకనివ్వరు ఇక్కడ. ఈ మాఫియా మనల్ని బతకనివ్వదు. మాఫియాకి దూరంగా ఉండాలంటే.. మనం బేస్ మీద ఉండాలి." అని బండ్ల గణేష్ అన్నారు.
మెగాస్టార్ ని టచ్ చేయలేము
"నాకొకటి బాగా గుర్తు . మెగాస్టార్ చిరంజీవి గారికి వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది. ఆ టైంలో 'పెళ్లి సందడి' సినిమాతో శ్రీకాంత్ ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అబ్బా శ్రీకాంత్ ఎక్కడికో వెళ్ళాడు.. అదీ ఇదీ అన్నారు. ఒక స్టార్ ని మనం ఏం చేయలేము. వంద కోట్లకి ఒక మెగాస్టార్ పుడతాడు. అలాంటి వాళ్ళని టచ్ చేయలేము. నువ్వు మంచి నటుడువి. నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ లా వాస్తవానికి దగ్గరగా బతుకు. టాలెంట్ ని నమ్ము, టాలెంట్ ని ఎంకరేజ్ చేయ్. టాలెంటే నీ సక్సెస్." అని బండ్ల చెప్పారు.
కష్టం ఒకరిది.. పేరు అల్లు అరవింద్ ది
ఇక నిర్మాత అల్లు అరవింద్ గురించి బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు కూడా చర్చనీయాంశంగా మారాయి. "బన్నీ వాసు, వంశీ నందిపాటి ఇంతా కష్టపడినా అల్లు అరవింద్ గారి సినిమా అంటారు. అది ఆయన అదృష్టం, వీళ్ళ బ్యాడ్ లక్. ఆయనేమి చేయడు, లాస్ట్ మినిట్ లో వచ్చి పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అలా ఉంది. అల్లు అరవింద్ గారి షర్ట్ నలగదు, హెయిర్ స్టైల్ మారదు. కానీ, డబ్బులు సంపాదిస్తుంటారు." అని బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
![]() |
![]() |