![]() |
![]() |

'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి దీపికా పదుకొణె(Deepika Padukone)ను తొలగిస్తున్నట్లు వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 'కల్కి'లో సుమతి అనే కీలక పాత్ర పోషించింది దీపిక. నిజానికి ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది. అలాంటిది సీక్వెల్ నుంచి దీపికను తొలగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీపిక పెడుతున్న మితిమీరిన కండిషన్స్ ని తట్టుకోలేకనే.. మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. (Kalki 2)
'కల్కి-2' నుంచి దీపికను తొలగించడంతో ఆమె స్థానంలో ఎవరు నటిస్తే బాగుంటుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కల్కి-2 లాంటి భారీ సినిమాకి గ్లోబల్ స్థాయి గుర్తింపు ఉన్న ప్రియాంక, ఐశ్వర్యలలో ఒకరిని తీసుకునే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ నుంచి అలియా భట్ పేరు కూడా బాగానే వినిపిస్తోంది. సుమతి పాత్రకు సరిగ్గా సరిపోతుందంటూ కొందరు ఏఐ ఫొటోలు కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇటీవల మలయాళ చిత్రం 'లోకా'తో సంచలనం సృష్టించిన కళ్యాణి ప్రియదర్శన్ కూడా బెస్ట్ ఆప్షన్ అంటున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వీరితో పాటు రుక్మిణి వసంత్, కృతి సనన్, అనుష్క శెట్టి, సమంత, నయనతార వంటి పేర్లు కూడా కొందరు సూచిస్తున్నారు.
కల్కి సీక్వెల్ లో దీపిక స్థానంలో ఎవరు నటిస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.
![]() |
![]() |