![]() |
![]() |

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన చిత్రం 'కల్కి 2898 AD'. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా.. గతేడాది విడుదలై, వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 'కల్కి 2898 AD'కి సీక్వెల్ కూడా ఉంది. అయితే ఈ సీక్వెల్ నుంచి కథకి కీలమైన సుమతి పాత్ర పోషించిన దీపికను తప్పించారు. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించడం విశేషం. (Deepika Padukone)
"కల్కి 2898 AD సీక్వెల్‌లో దీపికా పదుకొణె భాగం కాదని అధికారికంగా ప్రకటిస్తున్నాము. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము. కల్కి లాంటి సినిమాకి నిబద్ధత మరియు మరెన్నో అవసరం. ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము." అంటూ వైజయంతి మూవీస్ కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా ఈ ప్రకటనలో "కల్కి లాంటి సినిమాకి నిబద్ధత అవసరం." అనే లైన్ హాట్ టాపిక్ గా మారింది. (Kalki 2)
నిజానికి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందనున్న 'స్పిరిట్'లో కూడా దీపిక హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ, దీపిక డిమాండ్స్ దారుణంగా ఉండటంతో ఆమె స్థానంలో తృప్తి డిమ్రిని తీసుకున్నారు. మరి 'స్పిరిట్' ప్రభావమో లేక 'కల్కి 2' విషయంలో కూడా దీపిక డిమాండ్స్ అలాగే ఉన్నాయో కానీ.. ప్రభాస్ నటిస్తున్న రెండు భారీ సినిమాల నుంచి దీపికను తొలగించడం సంచలనంగా మారింది.

![]() |
![]() |