![]() |
![]() |

తెలుగు సినిమా జననం, నటసామ్రాట్, ఎవర్ గ్రీన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత 'అక్కినేని నాగేశ్వరరావు'(ANR)గారి సినీ రంగ ప్రవేశం ఇంచు మించు ఒకేసారి జరిగిందని చెప్పవచ్చు. ఆయనతో పాటే తెలుగు సినిమా కూడా ఎదిగింది. ఏడున్నర దశాబ్దాల సినీ ప్రస్థానం 'ఏఎన్ఆర్' సొంతం. దీన్ని బట్టి నటనా రంగంలో ఆయన సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. జానపద, పౌరాణిక,సాంఘిక, భక్తి రసచిత్రాల్లో ఆయన పోషించని క్యారక్టర్ లేదు. ఎన్నో అద్భుతమైన క్యారక్టర్ లు నేటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో పదిలంగా ఉన్నాయి..
ఏఎన్ ఆర్ 101 వ జయంతి సెప్టెంబర్ 20 న జరగనుంది. ఈ సందర్భంగా ఆయన వారసుడు కింగ్ 'నాగార్జున'(Nagarjuna)తన తండ్రి నటించిన ఎన్నో మరుపురాని చిత్రాల్లోని డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం సినిమాలని అభిమానులతో పాటు,ప్రేక్షకుల కోసం రెండు తెలుగు రాష్టాల్లో విడుదల చేస్తున్నారు. కాకపోతే వీటిని ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్ వివరాలు 'బుక్ మై షో' లో అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం కూడా నాగార్జున ఈ అవకాశాన్ని కలిపించిన విషయం తెలిసిందే.
దీంతో థియేటర్స్ లో 'ఏఎన్ఆర్' అభిమానుల కోలాహలం నెలకొంది. ఈ సంవత్సరం కూడా అంతకు మించిన కోలాహలం నెలకొని ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పటిలాగానే రెండు రాష్ట్రాల్లో ఉన్న అభిమానులు 'ఏఎన్ఆర్' జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా జరపనున్నారు.
![]() |
![]() |