![]() |
![]() |
తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌వర్మ డైరెక్షన్‌లో రూపొందిన హనుమాన్ ఎంత భారీ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా విషయంలో ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. మళ్ళీ అదే తరహాలో మ్యాజిక్ చేసేందుకు ‘మిరాయ్’ చిత్రంతో రాబోతున్నాడు తేజ. ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. అతనికి ధీటుగా మరో పాత్రలో మంచు మనోజ్ తన పెర్‌ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేయబోతున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్‌లో జరిగింది.
ఈ ఈవెంట్‌లో తేజ సజ్జ స్పీచ్ అందర్నీ ఎమోషనల్‌గా టచ్ చేసింది. ఒక మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం అంటూ ప్రేక్షకులనుద్దేశించి అతను మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాదు, ఈ సందర్భంగా ఆడియన్స్ కోసం ఒక గిఫ్ట్‌ని కూడా ఎనౌన్స్ చేశాడు. థియేటర్లలో టికెట్ రేట్లు అధికంగా ఉండడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనే వార్తలు ఇటీవలికాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమాకు ఎలాంటి హైక్స్ లేకుండా తక్కువ ధరకే సినిమా చూసేలా ప్లాన్ చేస్తున్నామని తేజ వివరించాడు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లను ఒప్పించి ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు.
ఇక ఈ సినిమాలో రెండు సర్‌ప్రైజ్‌లు ఉన్నాయంటూ ఆడియన్స్‌కి మరో షాక్ ఇచ్చాడు తేజ. అతని నోటి నుంచి ఆ మాట వచ్చిన క్షణం నుంచే సినిమాలో ఎవరైనా స్టార్స్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారా అనే చర్చ మొదలైంది. అతను చెప్పిన దాన్ని బట్టి ఆ రెండు సర్‌ప్రైజ్‌లు సినిమాకి ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయి. నిర్మాణపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను పూర్తి చెయ్యడానికి మేకర్స్‌కి అన్నీ బాగా కలిసి వచ్చాయి. మరి థియేటర్లలోకి వచ్చిన తర్వాత సినిమాపై ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారనేది చూడాల్సి ఉంది.
![]() |
![]() |