![]() |
![]() |

దర్శకధీరుడు 'రాజమౌళి'(SS Rajamouli)ప్రస్తుతం సూపర్ స్టార్ 'మహేష్ బాబు'(Mahesh Babu)తో తెరకెక్కిస్తున్న చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 'ssmb 29 'అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి తో పాన్ ఇండియా సినిమాలకి తెరలేపిన రాజమౌళి ఆస్కార్ ని కూడా అందుకోవడంతో,ssmb 29 ని పాన్ వరల్డ్ సినిమాగా నిలబెట్టాలనే పట్టుదలతో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకు తగ్గట్టే ssmb 29 కాస్టింగ్, సబ్జెట్ ఉండనుంది.
రాజమౌళి ఇంత బిజీలో కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తు అభిమానులని అలరించనున్నాడు. బాలీవుడ్ బాద్షా 'షారుక్ ఖాన్'(Shah Rukh Khan)కొడుకు 'ఆర్యన్ ఖాన్'(Aryan Khan) దర్శకుడిగా 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'(The Bads Of Bollywood)అనే వెబ్ సిరీస్ తో పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. లష్య(Lakshya),సహేర్(Saher)లు హీరో హీరోయిన్స్ గా చేస్తుండగా, బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నెట్ ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ అయ్యింది. రాజమౌళి, అమీర్ ఖాన్ తో కలిపి కనపడ్డాడు. లక్ష్య, రాజమౌళి గురించి గొప్పగా చెప్తు 'షాట్ మేకింగ్, ఫిలిం మేకింగ్ సూపర్ అని అంటాడు. ఆ తర్వాత లక్ష్య ని అమీర్ పిలిచి 'నీకు ఇడ్లి సాంబార్ కావాలా, వడ పావ్ కావాలా' అని అంటాడు. 'వడ పావ్ కావాలని లక్ష్య అనగానే అమీర్ ఆశ్చర్యంగా చూస్తూ వెళ్ళిపోతాడు. లేదు నాకు ఇడ్లి సాంబార్ కావాలని వెంటపతాడు.
గతంలో అంబానీ(Ambani)కొడుకుపెళ్ళిలో 'రామ్ చరణ్'(Ram Charan)ని ఉద్దేశించి ఇడ్లీ, సాంబార్ అని షారుఖ్ పిలిచిన విషయం తెలిసిందే. ఈ డైలాగ్ పై వివాదాస్పదం కూడా అయ్యింది. ఇప్పుడు బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ లో సరదాగా చెప్పినా కూడా,సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై షారుక్ వైఫ్ 'గౌరీఖాన్' అత్యంత భారీవ్యయంతో నిర్మించగా, షారుక్ కూడా అతిధి పాత్రలో కనిపిస్తున్నాడు. ,ఈ నెల 18 న నెట్ ఫ్లిక్స్(Netflix)వేదికగా స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ లో హీరోగా సత్తా చాటుదామని అనుకున్న యువకుడు ఎన్ని ఇబ్బంధులు ఎదురుకున్నాడు? చివరకి హీరోగా సక్సెస్ అయ్యాడా లేదా అనే పాయింట్ తో ఈ సిరీస్ తెరకెక్కింది.

![]() |
![]() |