![]() |
![]() |

2022లో విడుదలైన 'డీజే టిల్లు'తో దర్శకుడిగా పరిచయమైన విమల్ కృష్ణ.. థియేటర్లలో నవ్వులు పూయించి, మొదటి సినిమాతోనే ఘన విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దానికి సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్' వచ్చింది కానీ.. ఆ చిత్రానికి ఎందుకనో విమల్ కృష్ణ దర్శకత్వం వహించలేదు. 'డీజే టిల్లు' వచ్చి ఇప్పటికే మూడేళ్లు దాటిపోయింది. ఇంతకాలం పాటు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కొత్త సినిమాని ప్రకటించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు విమల్ కృష్ణ తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశాడు.
విమల్ కృష్ణ మొదటి సినిమాలోని టిల్లు పాత్ర తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన నెక్స్ట్ మూవీతో మరో వింత పాత్రను ప్రేక్షకులను పరిచయం చేయబోతున్నాడు.
చిలకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్, ప్రిన్స్ సెసిల్, అనన్నయ, చరిత్ర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా సునీల్ కుమార్ నామా, ఆర్ట్ డైరెక్టర్‌గా జె.కె. మూర్తి, ఎడిటర్ గా అభినవ్ కునపరెడ్డి వ్యవహరిస్తున్నారు.
నేడు పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మేఘ చిలక, స్నేహ జగ్తియాని క్లాప్ కొట్టారు. సునీల్ నామా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు ప్రారంభం కావడం విశేషం.
ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా మార్చే ఒక వింత పాత్ర మరియు భావనను వివరించడానికి విమల్ కృష్ణ సిద్ధంగా ఉన్నాడు. పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ చిలక ప్రొడక్షన్స్ కోసం 4వ నిర్మాణం, ఇది గతంలో ఆ ఒక్కటి అడక్కు చిత్రాన్ని నిర్మించింది. అభిరుచి గల నిర్మాతలు రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్, నవీన్ చంద్ర ఈ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు.
![]() |
![]() |