![]() |
![]() |
.webp)
పద్మశ్రీ 'అల్లు రామలింగయ్య'(Allu Ramalingaiah)గారి సతీమణి 'అల్లు కనకరత్నం'(Allu Kanakaratnam)గారు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యల తలెత్తడంతో చనిపోవడం జరిగింది. దీంతో అల్లు, కొణిదెల కుటుంబసభ్యులు తీవ్ర దిగ్బ్రాంతి లో ఉన్నారు. పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు కనకరత్నం గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తన అత్తయ్య మృత దేహాన్ని సందర్శించడానికి వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవి,అల్లు అర్జున్ పక్క పక్కనే కూర్చోని మాట్లాడుకోవడం కనిపించింది. ఇక కనకరత్నం గారిని చూడటానికి పవన్ కళ్యాణ్ ఏపి నుంచి బయలు దేరాడని తెలుస్తుంది. గత కొంత కాలంగా అల్లు, కొణిదెల కుటుంబాల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 2 కి సంబంధించి అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ ని కలవడానికి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వెళ్తాడని అనుకున్నారు. కానీ వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో కనకరత్నం గారి పార్థివ దేహాన్ని సందర్శించడానికి పవన్ కళ్యాణ్ వెళ్తుండటం ఇరువురి అభిమానుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
పవన్ కళ్యాణ్ గతంలో తన 'తీన్ మార్' మూవీ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతు నేను సినిమాల్లోకి రావాలని కోరుకున్న మొదటి వ్యక్తి 'అల్లు కనకరత్నం' గారు. 6 th క్లాస్ లో ఉన్నప్పట్నుంచే నన్ను 'కళ్యాణి' అని పిలిచేవారు. అల్లు అరవింద్ గారితో నన్ను సినిమాల్లో పెట్టమని గొడవ చేస్తుండేవాళ్ళని పవన్ చెప్పుకొచ్చాడు.

![]() |
![]() |