![]() |
![]() |

అల్లు కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ మాతృమూర్తి, అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 94 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె అర్ధరాత్రి దాటాక అంటే 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. (Allu Kanakaratnam)
అల్లు కనకరత్నమ్మ అల్లు అర్జున్ కి నాయనమ్మ, రామ్ చరణ్ కి అమ్మమ్మ అవుతారు. ప్రస్తుతం షూటింగ్ కోసం బన్నీ ముంబైలో ఉండగా, చరణ్ మైసూర్ లో ఉన్నాడు. ఈ విషాద వార్త తెలిసి వారు అక్కడి నుంచి వెంటనే బయల్దేరారు. ఇద్దరూ కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు.
కనకరత్నమ్మ అంత్యక్రియలు మధ్యాహ్నం తర్వాత కోకాపేటలో జరగనున్నాయి.
![]() |
![]() |