![]() |
![]() |
![]()
సినిమాలో కంటెంట్ ఉంటే.. స్టార్స్ లేకపోయినా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయవచ్చని మరోసారి నిరూపించిన చిత్రం 'మహావతార్ నరసింహ'. జూలై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ డివోషనల్ ఫిల్మ్.. ఐదు వారాలుగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. తాజాగా రూ.300 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరి సంచలనం సృష్టించింది. (Mahavatar Narsimha)
స్టార్ హీరోల సినిమాలే 300 కోట్లు కలెక్ట్ చేస్తే గొప్పగా భావిస్తారు. అలాంటిది ఓ యానిమేషన్ ఫిల్మ్ 300 కోట్లు కలెక్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు. పైగా ఈ ఐదు వారాలలో ఇండియా వైడ్ గా ఎందరో స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. హరి హర వీరమల్లు, కింగ్డమ్, సన్ ఆఫ్ సర్దార్ 2, వార్ 2, కూలీ.. ఇలా ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ కంటెంట్ బలంతో, మౌత్ టాక్ తో.. రోజురోజుకి వసూళ్లను పెంచుకుంటూ 'మహావతార్ నరసింహ' 300 కోట్ల క్లబ్ లో చేరింది. ఫుల్ రన్ లో రూ.350 కోట్లు రాబట్టే అవకాశముంది.
ఈ రోజుల్లో ఓ సినిమా రెండు వారాలు ఆడితే గొప్ప అన్నట్టుగా పరిస్థితి ఉంది. అలాంటిది ఏకంగా ఐదు వారాలు పాటు.. కొత్త సినిమాలతో పోటీ పడుతూ మంచి వసూళ్ళు రాబట్టడం అనేది అంత తేలికైన విషయం కాదు. పైగా ఇప్పటికీ బుక్ మై షోలో ట్రెండింగ్ లో ఉంది. ఆరో వారంలోనూ ఇదే జోరు కొనసాగించేలా ఉంది. ఇదే ట్రెండ్ కొనసాగితే.. ఈ మధ్య కాలంలో 50 రోజులు ఆడిన సినిమాగా చరిత్ర సృష్టించినా ఆశ్చర్యం లేదు.
![]()
![]() |
![]() |