![]() |
![]() |

పద్మశ్రీ 'అల్లు రామలింగయ్య'(Allu Ramalingaiah)గారి సతీమణి 'అల్లు కనకరత్నం'(Allu Kanakaratnam)గారు ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ లోని తన నివాసంలో వృద్ధాప్య సమస్యల తలెత్తడంతో చనిపోవడం జరిగింది. దీంతో అల్లు, కొణిదెల కుటుంబసభ్యులు తీవ్ర దిగ్బ్రాంతి లో ఉన్నారు. ఇక పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు కనకరత్నం గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.
రీసెంట్ గా కనకరత్నం గారి మృతిపై 'మెగాస్టార్ చిరంజీవి'(Chiranjeevi)ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'మా అత్తయ్య గారు కీర్తి శేషులు అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేసాడు.
అల్లు రామలింగయ్య, కనకరత్నం గార్లకి మన దేశానికీ స్వాతంత్రం రాక ముందే వివాహం జరిగింది. నూలు వడకడంలో కనకరత్నం గారు జిల్లా స్థాయిలో ప్రధమ బహుమతి అందుకోవడంతో పాటు,స్వాతంత్రోద్యమంలో పాల్గొందని కనకరత్నం గారిని రామలింగయ్య గారు తన జీవితంలోకి ఆహ్వానించడం జరిగింది.

![]() |
![]() |