![]() |
![]() |

మరాఠా యోధుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్'(Chhatrapati Shivaji Maharaj)తనయుడు 'ఛత్రపతి శంభాజీ మహారాజ్'(Chhatrapati Shambaji Maharaj)జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హిందీ చిత్రం 'చావా'(Chhaava).గత నెల ఫిబ్రవరి 14 న బాలీవుడ్ లో విడుదలైన ఘన విజయం సాధించింది.ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే 500 కోట్ల రూపాయలని వసులు చేసిందంటే 'చావా'సాధించిన ఘన విజయం ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.తెలుగు నాట కూడా హిందీ లాంగ్వేజ్ లో విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. .దీంతో తెలుగు లాంగ్వేజ్ లో కూడా విడుదల చెయ్యాలని శివాజీ, శంభాజీ అభిమానులతో పాటు ప్రేక్షకులు డిమాండ్ చేస్తు వచ్చారు.
వాళ్ళందరి కోరిక ప్రకారం 'చావా'ఈ రోజు తెలుగు నాట విడుదలైంది.ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్(Geetha Arts)రెండు తెలుగు రాష్ట్రాల్లో 550 స్క్రీన్స్ లో విడుదల చేసింది.ఇప్పుడు ఈ మూవీలో చరిత్రని వక్రీకరించారని, ఏపి లో విడుదల కాకుండా ఆపాలని 'ముస్లిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మహమ్మద్ జియా ఉల్ హక్' నెల్లూరు జిల్లా కలెక్టర్ కి ఒక వినతి పత్రాన్ని అందివ్వడం జరిగింది.
చావా' లో 'శంభాజీ మహారాజ్' గా విక్కీ కౌశల్(Vicky Kaushal)ఆయన భార్య 'యేసుబాయ్' గా రష్మిక(Rashmika)ఔరంగజేబు క్యారక్టర్ లో అక్షయ్ ఖన్నా(Akshaya khanna)తమ తమ క్యారక్టర్ లలో ప్రాణం పెట్టి నటించారు.ప్రదీప్ రావత్,అశుతోష్ రానా వంటి సీనియర్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించగా లక్ష్మణ్ రామచంద్ర ఉటేకర్(Laxman ramchandra utekar)దర్శకత్వం వహించాడు.దినేష్ విజయన్(Dinesh Vijayan)నిర్మాత కాగా ఏ ఆర్ రెహ్మాన్(Ar rehman)మ్యూజిక్ ని అందివ్వడం జరిగింది.'చావా' అంటే 'పులిబిడ్డ'అని అర్ధం.

![]() |
![]() |