![]() |
![]() |
.webp)
నాగ చైతన్య, సాయి పల్లవి మూవీ తండేల్ చూసాం. ఐతే అది రియల్ స్టోరీ. ఆ స్టోరీకి సంబందించిన వాళ్ళను శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఈవారం షోకి తీసుకొచ్చారు. వాళ్ళే రామారావు, నూకమ్మ. ఇక రష్మీ ఐతే రామారావు చేత చాలా విషయాలు మాట్లాడించింది. అసలు పాకిస్థాన్ జైల్లో ఎలా ఉంటుంది అనే విషయాలు అతను కూడా చెప్పాడు. మూవీలో కూడా ఇండియా వాళ్ళను పాకిస్తాన్ వాళ్ళు తిట్టడం మనం చూసాం..ఇక రామారావు కూడా అదే విషయాన్నీ చెప్పాడు. "ఉదయం 9 అయ్యిందంటే చాలు జైలు గేట్ తాళాలు తీస్తారు. అక్కడ పాకిస్తాన్ ఖైదీలు చాలా భయంకరంగా ఉంటారు. మేము ఇండియన్స్ అని తెలిసాక వాళ్ళు మమ్మలి బాగా ఎగతాళి చేసే వాళ్ళు.‘‘ అంటూ వివరించాడు.
" ఇక రష్మీ ఐతే ఇంకో ప్రశ్న అడిగింది ..నిజంగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ అల్లు అర్జున్ ఫాన్స్ ఆ అని .."అవును..ఎందుకంటే తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ అవుతాయి. ఆ కానిస్టేబుల్ అల్లు అర్జున్ మూవీస్ ని ఎక్కువగా హిందీలో చూస్తూ ఉంటాడట. అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ కూడా కావాలని అడిగాడు. ఆటోగ్రాఫ్ మాకే దొరకదు ..ఇంకా నీకు ఎలా దొరుకుతుంది అని మేము నవ్వుకున్నాం. కానీ పాకిస్తాన్ లో కూడా తెలుగు వాళ్లకు ఫాన్స్ ఉండడం నిజంగా గర్వకారణం" అని చెప్పాడు. తర్వాత నూకమ్మ కూడా చెప్పింది. తన భర్త విడుదల ఐపోతాడు అన్న లాస్ట్ మినిట్ వరకు అందరం హ్యాపీగా ఉన్నాం కానీ ఆర్టికల్ 370 వచ్చాక అది కాస్త రివర్స్ అయ్యింది. మళ్ళీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా వాళ్ళ కోసం మా పోరాటం మొదలు పెట్టాం. చివరికి 14 నెలల తర్వాత విడుదల అయ్యారు అంతా అని చెప్పింది.
![]() |
![]() |