![]() |
![]() |

ప్రముఖ సినీ గాయని కల్పన(Kalpana)రెండు రోజుల క్రితం హైదరాబాద్(Hyderabad)లోని తన ఫ్లాట్ లో నిద్ర మాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్లడం,ఇంటి పక్క వాళ్ళ సాయంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి, హాస్పిటల్ లో జాయిన్ చేసిన విషయం తెలిసిందే. కల్పనకి, ఆమె మొదటి భర్త తో కలిగిన 19 ఏళ్ళ కూతురుకి మధ్య గొడవలు ఉన్నాయని,రెండవ భర్త తో కూడా గొడవలు జరుగుతున్నాయని, అందుకే కల్పన ఆత్మహత్యకి ప్రయిత్నించిందనే రకరకాల ప్రచారాలు బయటకి వచ్చాయి.కానీ కల్పన కూతురు కేరళ నుంచి రావడం, తన తల్లి ఆత్మహత్య కి ప్రయత్నించలేదని నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన అపస్మారక స్థితిలోకి వెళ్లిందని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
ఇప్పుడు ఈ మొత్తం విషయంపై కల్పన ఒక వీడియో రిలీజ్ చేసింది.అందులో ఆమె మాట్లాడుతు మీడియాలో నా గురించి,నా భర్త గురించి రాంగ్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది.ప్రస్తుతం నా వయసు నలభై ఐదు సంవత్సరాలు.పీహెడీ,ఎల్ఎల్ బి చేస్తున్నాను.మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ చేయడం వల్లనే చదువుకుంటున్నాను.మ్యూజిక్ విషయంలో కూడా అప్ డేట్ అవుతు కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.ఈ విధంగా అన్ని ఒకే సారి చేస్తుండంతోస్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పట్టడంలేదు.చాలా సంవత్సరాల నుంచి నిద్ర పోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది.ఇందుకు సంబంధించి డాక్టర్ దగ్గర 'ఇన్సోమియా'ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను.అందులో భాగంగా డాక్టర్ కొన్ని ప్రిస్క్రిషన్స్ ఇచ్చారు.దీంతో మెడిసిన్ కి సంబంధించిన డొసేజ్ ఎక్కువగా తీసుకోవడం వలన స్పృహ తప్పి అన్ కాన్సెస్ లోకి వెళ్లానని చెప్పుకొచ్చింది.
![]() |
![]() |