![]() |
![]() |

'క' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam) నుంచి వస్తున్న చిత్రం 'దిల్‌రూబా' (Dilruba). విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో రుక్సర్ థిల్లన్ హీరోయిన్. శివమ్ సెల్యులాయిడ్స్, సరిగమ బ్యానర్లపై రూపొందుతోంది. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న 'దిల్‌రూబా' మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.
'దిల్‌రూబా' ట్రైలర్ ఒక రెగ్యులర్ లవ్ స్టోరీలా ప్రారంభమైంది. అయితే నిమిషం తర్వాత ట్రైలర్ టర్న్ తీసుకున్న తీరు సర్ ప్రైజింగ్ గా ఉంది. తప్పు చేయకుండా సారీ చెప్పకూడదు అనేది హీరో పాలసీ. ఒక విషయంలో సారీ చెప్పకపోవడం వల్ల హీరో జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని లవ్ స్టోరీకి చిక్కులేంటి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. 'దిల్‌రూబా'లో సిద్ధు అనే యాంగ్రీ యంగ్ మ్యాన్ తరహా పాత్రలో కిరణ్ కనిపిస్తున్నాడు. ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని రూపొందించారని అర్థమవుతోంది. అలాగే ట్రైలర్ లో "తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీరిపోయిన తర్వాత చెప్పే థాంక్స్ కి నా దృష్టిలో వాల్యూ లేదు, "దేవుడు ఎప్పుడు మాట్లాడటం మానేశాడో తెలుసా?.. మనిషి మోసం చేయడం మొదలుపెట్టినప్పుడు" వంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం కూడా మెప్పించింది. మొత్తానికి 'దిల్‌రూబా' ట్రైలర్ చూస్తుంటే.. 'క' తర్వాత కిరణ్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు.
![]() |
![]() |