![]() |
![]() |

తమిళ(Thamila)సినీ రంగంలో స్టార్ హీరోస్ అజిత్(Ajith)ధనుష్(Dhanush)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు.సుదీర్ఘ కాలం నుంచి సినిమాలు చేస్తు అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో మూవీ తెరకెక్కబోతుందనే న్యూస్ తమిళ సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ధనుష్ దర్శకత్వంలో 'అజిత్' ఒక సినిమా చేస్తున్నాడనే వార్తలు తమిళ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.దీంతో ఈ న్యూస్ ఇద్దరి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.ధనుష్ దర్శకత్వంలో అజిత్ హీరోగా చెయ్యడం ఖాయమైతే,ఆ మూవీ ఇండియన్ చిత్ర పరిశ్రమలో ఒక క్రేజీ ప్రాజెక్టు గా మారే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు వారు అంటున్నారు.అజిత్ లేటెస్ట్ మూవీ 'గుడ్ బాడ్ అగ్లీ' వచ్చే నెల 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మూవీ తర్వాత అజిత్ తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు.దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ ధనుష్ డైరెక్షన్ లో త్వరలో అధికారకంగా ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది.
'ధనుష్' నటుడిగానే కాకుండా,దర్శకుడిగా కూడా తన సత్తా చాటతాడనే విషయం తెలిసిందే.లాస్ట్ ఇయర్ 'తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాయన్' తో పాటు,గత నెల ఫిబ్రవరి 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన'జాబిలమ్మ నీకు అంత కోపమా'తో దర్శకుడిగా మరో మారు తన సత్తా చాటాడు.ఈ రెండు చిత్రాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసాయి.ప్రస్తుతం తన స్వీయ దర్శకత్వంలో 'ఇడ్లి కడై' అనే మూవీ చేస్తున్నాడు.ఏప్రిల్ 10 వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.నాగార్జున(Nagarjuna)తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా మూవీ 'కుబేర'(Kubera)కూడా కంప్లీట్ అయినట్టే. జూన్ 20 న కుబేర థియేటర్స్ లో అడుగుపెట్టనుంది.
![]() |
![]() |