![]() |
![]() |

ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) సినిమా విడుదలైనప్పటి నుంచి.. మహాభారతం గురించి, అందులోని పాత్రల గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కర్ణుడి గురించి ఎక్కువ చర్చ నడుస్తోంది. అయితే ఇలాంటి సమయంలో 'కర్ణ' (Karna) టైటిల్ తో 'మంగళవారం' దర్శకుడు అజయ్ భూపతి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఆసక్తికరంగా మారింది.
'ఆర్ఎక్స్ 100'తో దర్శకుడిగా పరిచయమై, మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు అజయ్ భూపతి (Ajay Bhupathi). అయితే ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మహా సముద్రం' మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక గతేడాది 'మంగళవారం' అంటూ తన మూడో సినిమాతో అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ సంచలన దర్శకుడు మరో సెన్సేషన్ కి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
'కర్ణ' టైటిల్ తో అజయ్ భూపతి ఓ సినిమా చేయబోతున్నాడట. అయితే ఇది మైథలాజికల్ ఫిల్మ్ కాదని, విభిన్న కథతో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. స్టోరీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ సినిమాలో 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ హీరోగా నటించనున్నాడని టాక్. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
![]() |
![]() |