![]() |
![]() |

మాస్ లో తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే తెలుగునాట మాస్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో భారీ సెలబ్రేషన్స్ ఉండే అతికొద్ది హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. అలాంటి ఎన్టీఆర్ నుంచి చాలా గ్యాప్ తర్వాత 'దేవర' (Devara) రూపంలో అదిరిపోయే మాస్ బొమ్మ రాబోతుంది. అయితే రూరల్ లో ఈ సినిమాకి రీచ్ మామూలుగా లేదు.
"కాదేది ప్రమోషన్స్ కి అనర్హం" అన్నట్టుగా ఈమధ్య మేకర్స్ సినిమాల ప్రమోషన్స్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్ కి తీసుకెళ్లడం కోసం విభిన్న దారులు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు 'దేవర' కూడా అదే దారిలో పయనిస్తున్నాడు. రూరల్ ఏరియాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే ఐదు రూపాయల చిప్స్ ప్యాకెట్స్ పై దేవర పోస్టర్లను ముద్రించారు. మరి ఇది మేకర్స్ ఆలోచనో లేక తమ సేల్స్ పెంచుకోవడం ఆ చిప్స్ కంపెనీ చేసిన పనో తెలియదు కానీ.. 'దేవర'కి రూరల్ ఏరియాల్లో బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ జరుగుతోంది.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై రూపొందుతోన్న దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |