![]() |
![]() |

విక్టరీ వెంకటేష్(venkatesh)హీరోగా 2000 వ సంవత్సరంలో వచ్చిన కలిసుందాం రా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన హీరోయిన్ సిమ్రాన్(simran)ఆ తర్వాత నువ్వు వస్తావని, నరసింహ నాయుడు, మృగ రాజు, డాడీ తో ఎంతో మంది అభిమానులని సంపాదించింది.ముఖ్యంగా అన్నయ్య మూవీలో చిరుతో కలిసి ఆట కావాలా పాట కావాలా అంటు చిందులేసి తెలుగు ప్రేక్షకుల కలల రాణిగా మారింది. వాస్తవానికి తెలుగు కంటే ముందే తమిళం తో పాటు ఇతర భాషల్లోను సినిమాలు చేసింది. రీసెంట్ గా చిరంజీవి(chiranjeevi)బాలకృష్ణ (balakrishna)గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది.
సిమ్రాన్ తాజాగా జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ కి సంబంధిచిన కార్యక్రమంలో పాల్గొంది.ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలుగులో మళ్ళీ నటించాలని ఉంది. మంచి రోల్స్ వస్తే తప్పకుండా చేస్తానని చెప్పింది. అదే విధంగా కొన్ని పాటల గురించి చర్చకు వచ్చింది. వాటి మీద కూడా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పింది. చిరంజీవి హీరోగా వచ్చిన అన్నయ్య లోని ఆట కావాలా పాట కావాలా తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పుకొచ్చింది. మరి బాలయ్య ఫ్యాన్స్ డల్ అవుతారని కాబోలు నరసింహ నాయుడు మూవీలోని సాంగ్స్ కూడా చాలా ఇష్టం అని చెప్పింది.

ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2003 లో తన చిరకాల స్నేహితుడు దీపక్ బగ్గా ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది. ఇక కొంత కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుతుంది. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డు లు కూడా అందుకుంది. 1997 లో తమిళంలో వచ్చిన విఐపి సిమ్రాన్ ఫస్ట్ మూవీ. ఇప్పటి వరకు అరవై కి పైగా సినిమాలు చేసింది.
![]() |
![]() |