![]() |
![]() |

సడెన్ గా అల్లు అర్జున్(allu arjun)కనపడితే ఏం చేస్తాం. ఆనందంతో ఎగిరి గంతేసి ఒక సెల్ఫీ తీసుకొని మురిసిపోతాం. ఆ తర్వాత ఎప్పటికో గాని మనకి ఒక విషయం గుర్తుకు రాదు. అదేంటంటే పుష్ప కి బాగా గడ్డం ఉంటుంది కదా! మరేంటి మాములుగా ట్రిమ్ చేసుకొని ఉన్నాడు. పైగా పార్ట్ టూ షూటింగ్ రన్నింగ్ లోనే ఉంది కదా అని అనుకోని వెంటనే సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తాం. అప్పుడు ఒక న్యూస్ మన కంటపడుతుంది. దాంతో ఆ లుక్ లో ఎందుకున్నాడో అర్ధం అవుతుంది.
బన్నీ ప్రెజెంట్ పుష్ప 2(pushpa 2) ని చేస్తున్నాడు. అగస్ట్ 15 న రిలీజ్ కావాల్సిన మూవీ డిసెంబర్ కి వాయిదా పడింది. వాయిదా పడటానికి రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఏది కూడా నిజం కాదు. ఇక అసలు విషయానికి వస్తే కొంత మంది హీరోల నోటి వెంట వచ్చే డైలాగులు వాళ్ళకి పేటెంట్ డైలాగ్స్ కూడా మిగిలిపోతాయి. తగ్గేదేలే కూడా అలాంటిదే. బన్నీ ఆ డైలాగ్ ని గుబురుగా ఉన్న గడ్డం మీద నుంచి తిప్పుతు చెప్తాడు.దాంతో అల్లు అర్జున్ గడ్డం కూడా ఫేమస్ అయ్యింది. సినిమా మొత్తం కూడా అదే స్టైల్ తో ఉంటాడు. ఇప్పుడు పుష్ప టూ లో కూడా సేమ్ గెటప్ .పైగా అదంతా ఎలాంటి కాస్ట్యూమ్ కాదు. సొంతదే. మరి ఇప్పుడు బన్నీ కొత్త లుక్ లో కనపడ్డాడు. పొడవాటి గడ్డం లుక్ ని కాస్త ట్రిమ్ లుక్ లోకి మార్చి కనపడ్డాడు. దీంతో ఇప్పుడు ఈ లుక్ వైరల్ గా మారింది. అయితే ఇది పాత లుక్ అని ఇప్పుడు సోషల్ మీడియా లో దర్శనం ఇస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా పుష్ప టూ షూట్ కొనసాగుతూ ఉండగానే బన్నీ తన లుక్ మార్చేయడం చర్చకు దారి తీసింది.

ఈ మధ్య బన్నీ గురించి ఎదో ఒక న్యూస్ ప్రచురితం అవుతూనే ఉంది. రీసెంట్ గా గబ్బర్ సింగ్ సాయి బన్నీ సినిమాల్లో నటించనని బహిరంగంగానే స్టేట్ మెంట్ ఇచ్చాడు. అలా చెప్పడం వల్ల సాయి కి నష్టమే గాని బన్నీ కి వచ్చిన నష్టం లేదు. కానీ ఒక మాములు నటుడు అగ్ర హీరో గురించి అలా చెప్పడం సంచలనం సృష్టించింది. అదే విధంగా పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్ పడిందని, దర్శకుడు సుకుమార్(sukumar)వల్లనే అలా జరిగిందనే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఇంకో అడుగు ముందుకేసి అల్లు అర్జున్ గడ్డాన్ని ట్రిమ్ చేయడం వల్ల సుకుమార్ అలిగి ఫారెన్ వెళ్లాడనే చర్చ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం పుష్ప 2 నుంచి వచ్చిన రెండు పాటలు బన్నీ ఫ్యాన్స్ ని ప్రేక్షకులని ఉర్రుతలూగిస్తున్నాయి. దేవిశ్రీప్రసాద్(devisriprasad) సంగీత దర్శకుడు కాగా రష్మిక (rashmikha)హీరోయిన్. మైత్రి మూవీస్ (mythri movies)వారు నిర్మాతలు.
![]() |
![]() |