![]() |
![]() |

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో MLAగా గెలవడమే కాకుండా మొదటి సారి మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పవన్ కళ్యాణ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపై ఆశీనులైన అతిథులందరికీ నమస్కరించారు. తర్వాత సభా వేదిక ముందున్న ప్రజలకు అభివాదం చేశారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హాజరయ్యారు. వీరితో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా మరియు కూతురు ఆధ్యా కూడా తండ్రి ప్రమాణ స్వీకారంలో సందడి చేశారు.
.webp)
కాగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరుణంలో పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన x లో బ్యూటిఫుల్ పోస్ట్ చేసారు. పిల్లలతో వీడియో కాల్ మాట్లాడిన పోటోలను, వీడియోను షేర్ చేసిన రేణు దేశాయ్... కళ్యాణ్ గారికి తన బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను అని ఏపీకి ఇంకా సమాజానికి మీరు ఎంతో మంచి చేయాలని కోరకుంటున్నాను. ఈ పోస్ట్ ఇప్పుడు మెగా అభిమానుల్లో మరింత అనందాన్ని నింపడమే కాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
![]() |
![]() |