![]() |
![]() |

అన్నా లెజినోవా(anna lezhneva)పవన్ కళ్యాణ్ (pawan kalyan)భార్య. రాజకీయాల్లో పవన్ బిజీగా ఉన్న టైంలో పవన్ కి అన్ని విధాలుగా తోడు ఉంది. అందుకే అభిమానులు పవన్ ని ఎంతగా అభిమానిస్తారో అన్నా లెజినోవా ని కూడా అంతే అభిమానిస్తారు. లేటెస్ట్ గా ఆమె చేసిన పని అభిమానులకి ఆమె మీద ఇంకా గౌరవం పెరిగేలా చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆనందాన్ని తమ ఆనందంగా అభిమానులు భావిస్తారు. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ నారా చంద్ర బాబు నాయుడు(chandrababu naidu) గారు ప్రమాణ స్వీకారం చేసాడు. అదే విధంగా రాష్ట్రమంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం చేసాడు. దీంతో ఆయన అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. చాలా మంది పవన్ ప్రమాణ స్వీకారాన్ని వీడియోలు కూడా తీశారు.

అదంతా ఒక ఎత్తయితే ఇంకో స్పెషల్ పర్సన్ వీడియో తియ్యడం ఒక ఎత్తు. ఆ పర్సన్ ఎవరో కాదు అన్నా లెజినోవా. పవన్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే అన్నా లెజినోవా తన సెల్ ఫోన్ తో వీడియో తీసింది. ఆమె అలా వీడియో తీసే ఎపిసోడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే ఆ కార్యక్రమంలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
![]() |
![]() |