![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశం కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పైగా ఆఫ్ స్క్రీన్ లుక్స్ తో అప్పుడే ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు అకీరా. ముఖ్యంగా గత కొద్దిరోజులుగా ఈ మెగా వారసుడు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. ఈ క్రమంలో పవన్ వెంట కనిపిస్తూ అకీరా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతని హైట్, లుక్స్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. సరైన సినిమాతో హీరోగా పరిచయమైతే.. చిన్న వయసులోనే అకీరా స్టార్డంని సొంతం చేసుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. పవన్ సైతం అకీరా కోసం అందుకుతగ్గ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా మారారు. ఇప్పుడు ఆయన తన ఫుల్ ఫోకస్ ని పాలిటిక్స్ పైనే పెట్టాలని భావిస్తున్నారట. అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని చూస్తున్నారట. పవన్ రాజకీయాలతో ఎంత బిజీగా మారినా.. ఆయన నుంచి సినిమాలు రాకపోతే అభిమానులు ఫీలవుతారు. అందుకే ఆ లోటుని భర్తీ చేసేలా.. అకీరాను హీరోగా పరిచేయడానికి పవన్ సన్నాహాలు చేస్తున్నారట. అందుకే ఇప్పటినుంచే తన వెంట తిప్పుతూ.. అభిమానుల దృష్టి తన కుమారుడిపై పడేలా చేస్తున్నారట.
అయితే అకీరా నందన్ హీరోగా పరిచయం అవుతున్నాడంటే.. పవన్ ఖచ్చితంగా దర్శకత్వ బాధ్యతలు త్రివిక్రమ్ కి అప్పగిస్తారని భావిస్తారంతా. ఎందుకంటే, పవన్-త్రివిక్రమ్ మంచి స్నేహితులు. పవన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి.. ఆయన సినిమాల ఎంపిక బాధ్యత త్రివిక్రమే తీసుకున్నారు. దాంతో పవన్.. తన కుమారుడిని లాంచ్ చేసే బాధ్యతని కూడా త్రివిక్రమ్ కి అప్పగిస్తారనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ పవన్ మాత్రం అనూహ్యంగా పూరి జగన్నాథ్ కి అప్పగించినట్లు సమాచారం.
పవన్ హీరోగా నటించిన 'బద్రి' సినిమాతోనే పూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. పైగా ఆ సినిమాలో అకీరా తల్లి రేణు దేశాయ్ కూడా నటించారు. ఇలా తన తల్లిదండ్రులు నటించిన సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన పూరి.. తన మొదటి సినిమాకి డైరెక్టర్ అవ్వడం అకీరాకి గొప్ప అనుభూతి అనే చెప్పాలి.
టాలీవుడ్ లో హీరోలను కొత్తగా ప్రెజెంట్ చేసే డైరెక్టర్ గా పూరికి పేరుంది. ఆయన సినిమాల్లోని హీరోల మ్యానరిజమ్స్ కి యూత్ ఎంతగానో అట్రాక్ట్ అవుతారు. ఓ రకంగా యూత్ లో పవన్ కి తిరుగులేని కల్ట్ ఫ్యాన్స్ బేస్ రావడానికి కారణమైన సినిమాల్లో పూరి డైరెక్ట్ చేసిన 'బద్రి' ఒకటి. అందుకే అకీరాను మొదటి సినిమాతోనే యూత్ కి బాగా దగ్గర చేయడం కోసం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు మెగా కుటుంబానికి చెందిన మరో స్టార్ రామ్ చరణ్ మొదటి సినిమా 'చిరుత'కి కూడా పూరినే దర్శకుడు. పూరి చేతుల మీదుగా హీరోగా పరిచయమైన చరణ్.. ఇప్పుడు తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. ఇవన్నీ ఆలోచించే.. అకీరా డెబ్యూ మూవీ బాధ్యతను పూరికి అప్పగించాలని పవన్ డిసైడ్ అయ్యారట. అంతేకాదు దీనిని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట. అన్ని అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |