![]() |
![]() |

వర్సటైల్ యాక్టర్ చలపతిరావు వారసుడుగా రవిబాబు (ravi babu)తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసాడు. ఎన్నో సినిమాల్లో నటించి కామెడీ విలన్ గా మంచి గుర్తింపు ని పొందాడు. ఆ తర్వాత దర్శకుడు గా మారి విభిన్నమైన సినిమాలని అందించాడు. లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న రవిబాబు నటి పూర్ణ కి తనకి మధ్య వస్తున్న పుకార్లు పై తన అభిప్రాయాన్ని తెలియచేసాడు.
నేను వరుసగా తెరకెక్కించిన అవును, అవును 2, లడ్డు బాబు, అదుగో మూవీల్లో పూర్ణ (poorna)నే ప్రధాన పాత్ర. దాంతో మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు పుట్టుకొచ్చాయి.పైగా కొన్ని మీడియా సంస్థలు కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా పుకారులని ప్రమోట్ చేసింది. నా కథకు ఎలాంటి హీరోయిన్ ని ఎంపిక చేసుకోవాలనే విషయంలో నాకొక క్లారిటీ ఉంది.ఆ విషయంలో ఎలాంటి రాజీపడను. పూర్ణ చాలా మంచి నటి. ఎంతో హార్డ్ వర్క్ తో పనిచేస్తుంది. అందుకే ఆమెని హీరోయిన్ గా సెలక్ట్ చేసుకున్నాను. తను యాక్ట్ చేస్తుంటే వన్ మోర్ అడగడానికి భయపడతాను. అంత శ్రద్దగా పనిచేస్తుంది. అంతే గాని మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ప్రెజంట్ రష్ అనే కొత్త మూవీ చేస్తున్నాను. అందులో కూడా పూర్ణ నే తీసుకునే వాడిని. కానీ యాక్షన్ కి సంబంధించిన మూవీ కావడంతో కుదరలేదు. పూర్ణ డ్యాన్సర్ కాకుండా ఫైటర్ అయ్యి ఉంటే కచ్చితంగా తీసుకునే వాడినని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
పూర్ణ రెండేళ్ల క్రితం షాహిద్ అసిఫ్ ఆలీ అనే దుబాయ్ కి చెందిన ఒక వ్యాపారవేత్తను వివాహమాడింది. కొన్ని రోజుల క్రితం ఒక బాబు కి కూడా జన్మనిచ్చింది. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా మారింది. పలు టెలివిజన్ షోస్ కూడా చేస్తుంది.కేరళ లోని కన్నూరు ఆమె స్వస్థలం. పూర్తి పేరు షమ్నా ఖాసీం.
![]() |
![]() |