![]() |
![]() |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'కల్కి 2898 AD'. వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. జూన్ 10న ట్రైలర్ విడుదలవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఆసక్తికరంగా మారింది.
'కల్కి' చిత్రంలో ప్రభాస్ ఉపయోగించిన వెహికిల్ 'బుజ్జి'ని పరిచయం చేయడం కోసం ఓ భారీ ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ ను తలదన్నేలా అత్యంత వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారట. ఈ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా జూన్ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 23 లేదా 25న జరిగే కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన సీఎం హోదాలో హాజరు కానున్నారని సమాచారం.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న కల్కి చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
![]() |
![]() |