![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. తన స్టార్డమ్ ని రెట్టింపు చేసేలా వరుస క్రేజీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం 'దేవర', 'వార్ 2' సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. ఆ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రికార్డు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
'కేజీఎఫ్', 'సలార్' సినిమాలతో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. తన డ్రీం ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ.130 కోట్ల పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్-నీల్ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 15 కి పైగా దేశాల్లో షూటింగ్ జరుపుకోనుందట. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని అంటున్నారు.
![]() |
![]() |