![]() |
![]() |

తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ అయ్యింది. థియేటర్స్ దగ్గర బాణా సంచా కాల్చడం, కట్ అవుట్ లు పెట్టడం, స్క్రీన్ మీద హీరో కనపడగానే ఈలలు కేకలు వెయ్యడం. ఇదంతా రొటీన్ గా జరిగే ప్రక్రియ. ఇందుకు బిన్నంగా సినిమా అనౌన్స్ చెయ్యగానే పైన చెప్పుకున్న హడావిడి అంతా జరుగుతుంది.
గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్ బికే(nbk)అభిమానులు ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. బాలయ్య బోయపాటి కాంబోలో మూవీ తెరకెక్కుతున్నట్టు ప్రకటన వచ్చింది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా bb4 పేరుతో ఒక పోస్టర్ రిలీజ్ తో అధికార ప్రకటన వచ్చింది. ప్రతిష్టాత్మక చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. పోస్టర్ అయితే పూర్తిగా భక్తి ప్రకంపనలతో నిండి ఉంది. సాయం సంధ్యవేళ ఆకాశం మొత్తం మేఘావృతమై ఉంది. ఒక భారీ రథచక్రం ఒక ఖాళీ ప్రదేశంలో ఉంటే దాని మీద bb4 అని ఉండగా నాలుగు నెంబర్ చివర రుద్రాక్ష బ్రాస్‌లెట్‌ను చూపించారు. దీంతో అఖండ 2 అనే వార్తలు వస్తున్నాయి.

ఇక బాలకృష్ణ(balakrishna)బోయపాటి శ్రీను(boyapari srinu)కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సింహ, లెజండ్, అఖండ తో హ్యాట్రిక్ అందుకున్నారు. తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల పరంగా సరికొత్త రికార్డులు కూడా సృష్టించారు.ఇప్పుడు నాలుగోసారి జోడి కడుతున్నారు. లెజండ్ ని 14 రీల్స్ సంస్థనే నిర్మించింది.ఈ మూవీకి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే బాలకృష్ణ చిన్న కూతురు ఎం తేజస్విని నందమూరి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది.
![]() |
![]() |