![]() |
![]() |

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ క్రమంలో చంద్రబాబు (Chandrababu)తో సహా ఎన్నికల్లో గెలిచిన తన కుటుంబ సభ్యులకు ట్విట్టర్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) శుభాకాంక్షలు తెలిపాడు.
"ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు… మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీలుగా గెలిచిన భరత్ కి, పురంధరేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు." అని ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.
ఎన్టీఆర్ చేసిన ట్వీటే నందమూరి అభిమానులకు, టీడీపీ శ్రేణులకు ఎంతో ఆనందాన్నికలిగించింది అంటే.. ఇక ఆ ట్వీట్ కి కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన రిప్లైలు ఆనందాన్ని రెట్టింపు చేశాయి. "థాంక్యూ వెరీ మచ్ అమ్మా" అంటూ చంద్రబాబు రిప్లై ఇవ్వగా, "థాంక్యూ వెరీ మచ్ తారక్" అంటూ లోకేష్ రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరి రిప్లైలు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. అయితే ఈ ఇద్దరి కంటే కూడా.. భరత్ రిప్లై మరింత ఆకర్షణగా ఉంది.
.webp)
"థాంక్యూ తారక్ అన్న. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు మేమందరం కృతనిశ్చయంతో ఉన్నాం. 'దేవర' సినిమాతో మీకు మంచి విజయం వస్తుంది అని కోరుకుంటున్నాను." అంటూ భరత్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఎన్టీఆర్ ట్వీట్ కి రిప్లై వచ్చింది. బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని భర్త భరత్ అనే విషయం తెలిసిందే. భరత్ కి ఎన్టీఆర్ వరుసకు బావ అవుతాడు. కానీ బావ అని సంబోదించకుండా "థాంక్యూ తారక్ అన్న" అని రిప్లై ఇచ్చాడు. దీంతో భరత్ హ్యాండిల్ నుంచి తేజస్విని రిప్లై ఇచ్చి ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఆమె కాబట్టే, 'దేవర' సినిమా ప్రస్తావన కూడా తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నచెల్లెల బాండింగ్ చూసి మురిసిపోతున్నారు.
![]() |
![]() |