![]() |
![]() |

తెలుగు సినిమాకి సరికొత్త సువాసనని అద్ది రెండు దశాబ్దాలకి పైగా తన నటనతో అలరిస్తూ వస్తున్న హీరో పవన్ కళ్యాణ్ (pawan kalyan) పవర్ స్టార్ అనే బిరుదుకి సరైన నిర్వచనం ఇస్తూ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి లక్షలాది మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఆ అభిమానమే జనసేన అనే పొలిటికల్ పార్టీని స్థాపించేలా చేసింది. తాజాగా ఆయనకి సంబంధిచిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
పవన్ మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం(pithapuram)అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసాడు. డెబ్భై వేల పై చిలుకు ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అభిమానులే కాకుండా సినీ పరిశ్రమకి చెందిన పలువురు హీరోలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు పవన్ కి అభినందలు తెలుపుతున్నారు.ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక యంగ్ అండ్ డైనమిక్ సె లబ్రిటీ పవన్ గెలుపుపై తన ఆనందాన్ని ఒక వీడియో రూపంలో తెలియచేసాడు. అతను ఎవరో కాదు అకిరానందన్(akira nandan)అకిరా అంటే పవన్ సన్ కదా అని అంటారా. ఎస్ పవన్ సన్ అకీరానే.. తన తండ్రి గెలిచిన సందర్భంగా ఒక సూపర్ వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసాడు ,పైగా తనే ఆ వీడియో కి ఎడిటర్ గా కూడా వ్యవహరించాడు. ఇప్పటికీ అక్కడ తిరుగుతున్న వారి కోసం పట్టు వదలకు అనే ఇనిస్ప్రెషన్ ఇచ్చే మాటలు టైటిల్స్ లాగా వచ్చాయి. పవన్ గత సినిమాలకి సంబంధించిన క్లిపింగ్స్ ని వాడాడు. పైగా అవన్నీ కూడా ఎలక్షన్స్ లో పవన్ చేసిన పోరాటానికి నిదర్శనంగా ఉన్నాయి. అంత బాగా ఎడిట్ చేసాడు. తమ్ముడు సినిమా నుంచి పవన్ మేనరిజమ్స్ అండ్ డైలాగ్స్ సునామి స్టార్ట్ అయ్యింది. ఆ మూవీ దగ్గర నుంచి మొన్న వచ్చిన బీమ్లా నాయక్ లోని పవన్ డైలాగ్స్ అండ్ క్లిపింగ్స్ వీడియోలో ఉన్నాయి. పవన్ పోరాట గెలుపుని అవి పర్ఫెక్ట్ గా సూచిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ఈ వీడియో అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటుంది.చాలా బాగా ఎడిట్ చేసావంటూ పవన్ అభిమానులు అకిరా ని మెచ్చుకుంటున్నారు.
ఈ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు కూడా అకిరాకు పవన్ అంటే చాలా ప్రేమ అని అనుకుంటున్నారు. ఇక అకిరా సినీ ఎంట్రీ కోసం అయితే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవలే నటనలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అలాగే మ్యూజిక్, ఎడిటింగ్ లో మంచి ప్రవేశం ఉంది. రేణు దేశాయ్ (renu desai)ఈ వీడియో ని షేర్ చేసింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు పవన్ కి దన్యవాదాలు కూడా తెలిపింది. కూతురు ఆధ్య కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పింది.
![]() |
![]() |