![]() |
![]() |
.webp)
నాచురల్ స్టార్ నాని (nani)..స్వయం కృషితో హీరో స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగి అశేష అభిమానులని సంపాదించాడు. చాలా సందర్బాలలో పవన్ కళ్యాణ్ కి బాసటగా నిలిచాడు. ఇప్పుడు ఇదే ఆనవాయితీ కొనసాగిస్తూ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
పవన్ కళ్యాణ్ (pawan kalyan)తను పోటీ చేసిన పిఠాపురం (pithapuram)అసెంబ్లీ నుంచి గెలుపొందాడు. సుమారు డెబ్భై వేల పై చిలుకు మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి పై గెలిచాడు. దీంతో ఆయన అభిమానుల్లో పండగ వాతావరణం వచ్చింది. పలువురు వెల్ విషర్స్ ఆయనకి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నాని ఒక ట్వీట్ చేసాడు. మీరు ధీమాగా ఉన్న తీరు, మీరు పోరాడిన తీరు మరియు మీరు గెలిచిన తీరు చెప్పడానికి కేవలం ఒక కథ మాత్రమే కాదు. మీ గురించి గర్వపడటానికి ఒక పాఠం సార్. మీరు గొప్ప గొప్ప ఎత్తులు మరియు మీ పనితో ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నాను అంటూ చేసాడు. అదే విధంగా పవన్ ఆన్ ది స్క్రీన్, ఆఫ్ ది స్క్రీన్ రెండిట్లోనూ హీరోనే అని పొగిడాడు.

![]() |
![]() |