![]() |
![]() |
.webp)
అగ్గంటుకుంది సంద్రం దేవ.. భగ్గున మండె ఆకసం.. అరాచకాలు భగ్నం దేవ.. చల్లారే చెడు సాహసం.. జగడపు దారిలోముందడుగైన సేనాని..జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని..దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే. దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే. ఈ పాటికే అర్ధమయ్యింది కదా ఎన్టీఆర్ (ntr) దేవర(devara) లోని సాంగ్ అని. రామజోగయ్యశాస్త్రి కలం నుంచి ఏ ముహూర్తాన వచ్చిందో గాని లేటెస్ట్ గా ఒక అరుదైన ఘనతని సాధించింది
సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ అయిన యూట్యూబ్ లో దేవర సాంగ్ ఇరవై తొమ్మిదవ స్థానం సాధించింది.వరల్డ్ మొత్తానికి చెందిన వంద పాటలని పరిగణలోకి తీసుకుంటే దేవర ఇరవై తొమ్మిదవ స్థానం సాధించింది. దీన్ని బట్టి సాంగ్ కి ఎంత ఆదరణ లభిస్తుందో అర్ధమవుతుంది.ఒక సారి విన్న వాళ్ళు సైతం పదే పదే వింటున్నారు.ముందు ముందు నెంబర్ వన్ సాంగ్ గా కూడా నిలబడటం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.ఇక దేవర అక్టోబర్ పది న ప్రేక్షకుల ముందుకు రావడానికి శరవేగంగా ముస్తాబు అవుతుంది. ఆర్ఆర్ఆర్(rrr)తర్వాత రెండు సంవత్సరాలకి వస్తున్న మూవీ కావడంతో అందరిలో భారీ అంచనాలే ఉన్నాయి.

ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ కి జతగా చేస్తుంది. ఇంకో హీరోయిన్ కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఆ విషయం మీద అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బాలీవుడ్ బడా హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకుడు .ఆచార్య ప్లాప్ తో చాలా కసిగా దేవరని తెరకెక్కిస్తున్నాడు. దేవర 2 కూడా ఉంది
![]() |
![]() |