![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న చిరంజీవి.. ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని పొందారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) గోల్డెన్ వీసాను చిరు అందుకున్నారు.

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. ఇప్పటికే చిరంజీవి కుటుంబం నుంచి ఆయన కోడలు, రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన ఈ వీసాను అందుకోవడం విశేషం. అలాగే తెలుగు హీరోలలో అల్లు అర్జున్ కూడా దుబాయ్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇతర భాషలకు చెందిన స్టార్స్ లో.. రజినీకాంత్, కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ వంటి వారు గోల్డెన్ వీసాను అందుకున్న వారిలో ఉన్నారు.
![]() |
![]() |