![]() |
![]() |

నందమూరి కళ్యాణ్ రామ్.. తెలుగు సినిమా పరిశ్రమలో ఎంత మంది హీరోలున్నా కూడా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు. ఎప్పటి కప్పుడు విభీమన్నమైన సినిమాలు చేస్తు క్రేజ్ ఉన్న హీరోగా మారాడు.అదే రీతిలో క్వాలిటీ హీరోగా కూడా మారాడు. వరుసగా బింబిసార, డెవిల్ లతో హిట్ కొట్టి ఇప్పుడు హ్యాట్రిక్ కి సిద్దమవుతున్నాడు.
ఈ రోజు కళ్యాణ్ రామ్ తాత దివంగత నందమూరి తారకరామారావు పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అంటు కళ్యాణ్ రామ్ న్యూ మూవీకి సంబంధించిన వీడియో ఒక దాన్ని రిలీజ్ చేసారు. కళ్యాణ్ రామ్ పూర్తిగా కనపడకపోయినా ఆయన కళ్ళు మాత్రం సినిమా ఎలా ఉండబోతుందో చెప్తున్నాయి. చేతులకి చిన్న సైజు రుద్రాక్షలు ధరించి శత్రువులకి చాలా బలమైన పంచ్ ఇవ్వబోతున్నాడని అర్ధం అవుతుంది. ఫిస్ట్ ఆఫ్ ఫ్లేమ్ అంటే పిడికిలి మంట.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన రాజా చెయ్యి వేస్తే ప్రదీప్ ఫస్ట్ మూవీ. ఎన్టీఆర్ ఆర్ట్స్ అండ్ అశోక క్రియేషన్స్ పై ముప్పా వెంకయ్య చౌదరి నిర్మిస్తున్నాడు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా చేస్తుండగా ఒకప్పటి టాప్ హీరోయిన్ విజయ శాంతి ఒక కీలక పాత్రని పోషిస్తుంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21 వ సినిమా.
![]() |
![]() |