![]() |
![]() |
.webp)
ప్రముఖ హీరో అల్లరి నరేష్(allari naresh)కి తెలుగు ప్రేక్షకులకి మధ్య ఉన్న అనుబంధం రెండు దశాబ్దాల పై మాటే. 2002 లో వచ్చిన అల్లరి ఆయన మొదటి మూవీ. కామెడీ నటుడు గానే తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించినా ఇప్పుడు అల్లరి నరేష్ ని కామెడీ నటుడు అనలేని పరిస్థితి. ప్రాణం, గమ్యం, ఉగ్రం,శుభప్రదం, నాంది, నా సామి రంగ లాంటి చిత్రాలతో వర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నాడు.టు డే టాక్ అఫ్ ది డే గా నిలిచాడు.
అల్లరి నరేష్ నయా మూవీ బచ్చల మల్లి (bachchala malli) కాసేపటి క్రితమే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. రిక్షా లో కూర్చోని నోట్లో బీడీ పెట్టుకున్న నరేష్ స్టిల్ సూపర్ గా ఉంది.. ఒక రకంగా చెప్పాలంటే ఊర మాస్ లుక్ తో అదరగొట్టాడు. పక్కా మాస్ ఎంటర్ టైనర్ తో మూవీ తెరకెక్కనుందనే విషయం అర్ధమవుతుంది. పైగా మేకర్స్ మూవీ గురించి ప్రస్తావిస్తు పేరు మల్లి, ఇంటి పేరు బచ్చల చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్..ఖచ్చితంగా బచ్చల మల్లి మీకు చాలా రోజులు గుర్తుండిపోతాడు అని ప్రకటించడంతో అల్లరి నరేష్ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలోకి వెళ్లాయి.

2020 లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సోలో బతుకే సోలో బెటర్ ఫేమ్ డైరెక్టర్ సుబ్బు మంగాదేవి దర్శకుడు కాగా ఊరుపేరు భైరవ కోన, సామజవరగమనా, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మాత. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.ప్రస్తుతానికి అయితే శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. హనుమాన్ మూవీ ఫేమ్ అమృత అయ్యర్ హీరోయిన్ గా చేస్తుండటం విశేషం. అల్లరి నరేష్ గత మూవీ ఆ ఒక్కటి అడక్కు..ఒక మోస్తరు విజయాన్ని అందుకుంది.
![]() |
![]() |