![]() |
![]() |

దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ జూన్ 4వ తేదీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆరోజు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆరోజుతో వరుసగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారా లేదా తేలిపోతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా అదే తేదీన రాబోతున్నాయి. దీంతో జూన్ 4 కోసం ఏపీ ప్రజలు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో సీనియర్ నటుడు నరేష్ చేసిన డిమాండ్ సంచలనంగా మారింది.

ఓట్ల లెక్కింపు రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని నరేష్ కోరారు. సోషల్ మీడియా వేదికగా ఈ డిమాండ్ ని ఆయన తెరపైకి తీసుకొచ్చారు. "లక్షలాది మంది కొత్త ఓటర్లు.. మార్పు కోసం తమ ఓటును వినియోగించుకున్నారు. దీని దృష్టిలో పెట్టుకొని.. పోలింగ్ రోజుని ఎలాగైతే సెలవు దినంగా ప్రకటించారో.. అలాగే ఓట్ల లెక్కింపు రోజును కూడా సెలవు దినంగా ప్రకటించాలి. టీవీల ముందు కూర్చుని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసేందుకు యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చర్య ఎక్కువ మంది వ్యక్తులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు అద్భుతమైన ప్రేరణగా ఉపయోగపడుతుంది." అని నరేష్ రాసుకొచ్చారు.
![]() |
![]() |