![]() |
![]() |

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (allu arjun) సినీ జర్నీ, సృష్టించిన రికార్డులు, ఫ్యాన్స్ బేస్ వీటి గురించి తెలియని తెలుగు సినిమా ప్రేక్షకుడు లేడు. పుష్ప తో భారతీయ సినీ ప్రేక్షకులు కూడా తన గురించి తెలుసుకునేలా చేసాడు. అభిమానులందరు ముద్దుగా బన్నీ అని పిలుచుకుంటారు. కొన్ని లక్షలాది మంది అభిమానులు ఆయన సొంతం . లేటెస్ట్ గా బన్నీకి సంబంధించిన పిక్ ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది
అల్లు అర్జున్ కి నంద్యాలలో ఉన్న ఫ్రెండ్ ఎవరు అని అడిగితే అందరు శిల్పా రవి చంద్రా రెడ్డి అని చెప్తారు.అంతలా ఇటీవల బన్నీ చేసిన నంద్యాల టూర్ ప్రజల్లో నాటుకు పోయింది. కానీ బన్నీ తో పాటు ఆయన శ్రీమతి స్నేహ రెడ్డి కూడా వెళ్లిందనే విషయం గురించి పెద్గగా బయటకి రాలేదు.కానీ స్నేహ రెడ్డి కూడా బన్నీ తో వెళ్ళింది.వాళ్లిద్దరు ఒక మాములు ధాబాలో కూర్చొని భోజనం చేస్తున్న పిక్ ఒకటి బయటకి వచ్చింది. అందులోని బన్నీ వేసుకున్న డ్రెస్ గెటప్ చూస్తే నంద్యాల వెళ్లినప్పటి ఫోటో అని ఈజీగా అర్ధం అవుతుంది.పైగా దీన్ని బట్టి అర్ధం అవుతుంది ఏంటంటే నంద్యాల నుంచి హైదరాబాద్ వెళ్తు ఇద్దరు కలిసి ధాబా లో భోజనం చేశారనే విషయం అర్ధం అవుతుంది. ఇన్ని రోజులు బన్నీ ఒక్కడే నంద్యాల వెళ్లాడని అందరు అనుకున్నారు. ఇప్పుడు స్నేహ రెడ్డి కూడా వెళ్లిందనే విషయం అర్ధమయ్యింది. అంటే తన భార్య సపోర్ట్ ఉందన్నమాట. మరి ఈ విషయంలో కూడా పవన్ ఫ్యాన్స్ స్పందిస్తారో లేదో చూడాలి.
ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఈ ఫోటోని చుసిన చాలా మంది బన్నీ సింప్లిసిటీ ని మెచ్చుకుంటున్నారు. అదే టైంలో దాబా న్యూస్ ఫ్యాన్స్ కి ముందుగానే తెలిసి ఉంటే లక్షలాదిగా మందిగా అక్కడకి చేరుకునే వారని అంటున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళడానికి బన్నీ చాలా ఇబ్బంది పడేవాడని అంటున్నారు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2 (pushpa 2) చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతున్న ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్ కాగా సుకుమార్ దర్శకుడు. ఆగస్టు 15 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఇటీవల వచ్చిన ఒక పాట యు ట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది
![]() |
![]() |