![]() |
![]() |

ఆమె గళం నుంచి వచ్చిన పాట వింటు సమ్మోహనంతో ఊగిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అమృతాన్ని సేవించిందేమో అన్నట్టుగా ఆ గళం యొక్క మాధుర్యం ఉంటుంది. ప్రేక్షకుల గుండెల్లో ఆమె పాట చిరస్థాయిగా నిలిచిపోవాల్సిందే. ఆ సింగర్ ఎవరో కాదు శ్రేయా ఘోషల్. తాజాగా ఆమెకి సంబంధించిన రూమర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
హీరో హీరోయిన్లకి ఎంత క్రేజ్ ఉంటుందో సింగర్ గా శ్రేయా ఘోషల్ కి అంతే క్రేజ్ ఉంది.మొత్తం 20 భాషల్లో 3000 సాంగ్స్ పాడిన రికార్డు ఆమె సొంతం.ఒక్కహిందీలోనే వెయ్యికి పైగా పాటలు పాడింది. లేటెస్ట్ గా ఆమె ఒక్కో పాటకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందనే దాని మీద చర్చ జరిగింది. ఒక్కో పాటకి 25 లక్షల దాకా తీసుకుంటుందని అంటున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. కాకపోతే ఈ విషయం మీద ఎలాంటి అధికార ప్రకటన లేదు. ఇప్పటి వరకు ఆమె సంపాదించిన ఆస్తి 200 కోట్లు దాకా ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి
2002 లో షారుక్ హీరోగా వచ్చిన దేవదాస్ ద్వారా ఆమె సినీ కెరీర్ ప్రారంభం అయ్యింది.మొదటి సినిమాకే నేషనల్ అవార్డు ని గెలుచుకుంది. తెలుగులో ఎన్నో అధ్బుతమైన పాటలు పాడింది. ఒక్కడు లోని నువ్వేం మాయ చేసావో గాని, ఎవడులోని నీ జతగా నేనుండాలి, వర్షం లోని కోపమా నా పైన, అతడు లోని పిల్లగాలి అల్లరి, ఉప్పెనలోని జల జల పాతం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ పాటలు ఉన్నాయి. లేటెస్ట్ గా ఆనిమల్ లో కూడా పాడింది.ఇటీవల అంబానీ కొడుకు వెడ్డింగ్ లోను ఎన్నో మధురమైన పాటలని ఆలపించింది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
![]() |
![]() |