![]() |
![]() |

గతేడాది 'సామజవరగమన'తో బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు. మార్చి 22న 'ఓం భీమ్ బుష్' అనే కామెడీ ఫిల్మ్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో చేస్తున్న సినిమాని తాజాగా ప్రకటించాడు. ఈ చిత్రానికి 'SWAG'(శ్వాగణిక వంశానికి స్వాగతం) అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు.
వివేక్ సాగర్ గాడి మోత లో, హసిత్ గోలి గాడి రాత తీతతో, విశ్వప్రసాద్ నిర్మిత శ్రీవిష్ణు గాడి సినిమా అంటూ అచ్చ తెలుగు సినిమాగా 'స్వాగ్'ను కొత్త ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. గతంలో శ్రీవిష్ణు-దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్ లో 'రాజ రాజ చోర' మూవీ వచ్చింది. ఆ విజయవంతమైన చిత్రం తర్వాత వీరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో 'స్వాగ్'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. శ్రీవిష్ణు పుట్టినరోజు(ఫిబ్రవరి 29) సందర్భంగా తాజాగా విడుదలైన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది. శ్వాగణిక వంశం ఏంటి? దాని కథ ఏంటి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ వీడియోని రూపొందించారు.

దీంతో పాటు గీత ఆర్ట్స్ బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు శ్రీవిష్ణు. ఆ సినిమా అధికారిక ప్రకటన కూడా ఈరోజు సాయంత్రం రానుంది.
![]() |
![]() |