![]() |
![]() |
.webp)
యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమాలు బాలివుడ్ లోనే ఎక్కువగా హిట్ అవుతుంటాయి. కానీ తెలుగులో సక్సెస్ రేట్ తక్కువే. అయితే ఇతర భాషలలో రిలీజైన సినిమాలు తెలుగులోకి డబ్ చేసినప్పుడు కంటెంట్ బాగుంటే అవి హిట్ అవుతుంటాయి. ఇప్పుడు అదే తరహాలో డైరెక్ట్ ఓటీటీలోకి వచ్చేస్తోంది ' మిషన్ ఛాప్టర్-1 '.
అరుణ్ విజయ్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ' మిషన్ ఛాప్టర్-1. గత నెల తమిళంలో విడుదలైన ఈ సినిమా తెలుగులో విడుదలవ్వడానికి సిద్ధమైంది. మొదట తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారంట మేకర్స్. కానీ అక్కడ సినిమా విడుదల తర్వాత ఫలితాలని చూసాక వద్దనుకొని డైరెక్ట్ గా ఓటీటీలోకి విడుదల చేయడానికి మేకర్స్ సిద్దమయ్యారు. మార్చి 1 న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని స్ట్రీమింగ్ తీసుకొస్తారని తెలుస్తోంది.
ఓటీటీ వేదికపై దక్షిణాది భాషలలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేయాలని సినిమా నిర్మాతలు చూస్తున్నారంట. ఈ సినిమా ట్రైలర్ లో అసలేం ఉందంటే.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జైలులో హీరో ఉంటాడు. ఆ జైలుని చూసుకునే పనిలో హీరోయిన్ ఉంటుంది. అయితే హీరో వాళ్ళ కూతురు ఇండియాలోని ఓ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతుంది. మరి అత్యంత ప్రమాదకరమైన జైలులో ఉన్న హీరో ఇండియాకి వచ్చి తన కూతురి ప్రాణాలని కాపాడుకోగలిగాడా? అసలెందుకు అతను జైలుకెళ్ళాడని తెలియాలంటే మార్చి 1 న నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యే ఈ సినిమాని చూసేయ్యండి.
![]() |
![]() |