![]() |
![]() |

ఆండ్రియా జెరెమియా..ఈ పేరు తెలియని దక్షిణ భారతీయ సినీ ప్రేమికుడు ఉండడు. సింగర్ గాను, నటిగాను ఆండ్రియా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 2005 లో తమిళ సినీరంగ ప్రవేశం చేసిన ఆమె నేటికీ తన సత్తా చాటుతు ముందుకు దూసుకుపోతుంది. తాజాగా తన పెళ్లి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఆండ్రియా ఇటీవలే ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో తన పెళ్లి ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆమె మాట్లాడుతు 25 ఏళ్ళ వయసులో పెళ్లి ఆలోచన వచ్చిందని కానీ అప్పుడు చేసుకోవడం కుదరలేదని చెప్పింది. అలాగే తన వయసు ఇప్పుడు 40 ఏళ్ళు కాబట్టి ఇంక పెళ్లి ఆలోచన కూడా లేదని చెప్పింది. అయినా ఒంటరి జీవితం చాలా హ్యాపీగా ఉందని దీనికే అలవాటు పడిపోయానని కూడా ఆమె చెప్పడం గమనార్హం. సోషల్ మీడియాలో ఆమె మాటలని చూసిన అందరు ఇక ఆండ్రియాకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అంటున్నారు.
ఆండ్రియా గతంలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ తో లవ్ లో ఉందనే వార్తలు వచ్చాయి. అందుకు బలం చేకూరేలా ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు.అలాగే ఒకరినొకరు ముద్దుపెట్టుకున్న ఫొటోస్ కూడా బయటకి వచ్చాయి. కానీ ఆ తర్వాత వాళ్లిద్దరు విడిపోయినట్టుగా ప్రచారం వచ్చింది. ఇక ఆండ్రియా లేటెస్ట్ గా వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ లో ఒక ముఖ్య పాత్రలో నటించింది. ఎన్టీఆర్ రాఖీ సినిమాలోని జర జర సాంగ్ అలాగే అల్లు అర్జున్ దేశముదురులోని గిలి గిలిగా సాంగ్ ఆమెకి ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. నటిగాను యుగానికి ఒక్కడు, విశ్వరూపం,తడాఖా లాంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించింది.
![]() |
![]() |