![]() |
![]() |

ఫిబ్రవరి 9 న థియేటర్స్ లో సందడి చెయ్యబోతున్న మూవీ లాల్ సలామ్. సూపర్ స్టార్ రజనీ కాంత్ గెస్ట్ రోల్ పోషిస్తున్న ఈ మూవీలో విక్రాంత్ హీరోగా చేస్తుండగా మిగతా పాత్రల్లో నిరోషా ,జీవిత, తంబిరామయ్య, సెంథిల్, తుంగదురై తదితరులు నటించారు. రిలీజ్ కి సిద్దమవుతున్న వేళ రజనీ కూతురు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సౌత్ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి.
లాల్ సలామ్ కి రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. కొన్ని రోజుల క్రితం ఆ మూవీ ఆడియో ఫంక్షన్ లో ఐశ్వర్య మాట్లాడిన మాటలు లాల్ సలామ్ ని ప్రమోషన్ చేసుకోవడానికనే విమర్శలు వచ్చాయి.ఈ విషయాన్ని రజనీకాంత్ దగ్గర కూడా కొంత మంది ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంపై నిన్న జరిగిన లాల్ సలాం ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ లో ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది. తన ద్వారానో లేక సినిమాలోని రాజకీయాంశాల ద్వారానో సూపర్ స్టార్ నటించిన సినిమా ఆడాల్సిన అవసరం లేదు .ఎలాంటి రాజకీయాలు లేని జైలర్ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యిందని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే వ్యక్తిగత భావాలకి గౌరవం ఇచ్చే వ్యక్తి తన తండ్రి అని కూడా ఆమె తెలిపింది.

రాజకీయం అనేది ప్రతి రంగంలో కూడా ఉందని అలాంటి రాజకీయంతో కూడిన క్రీడా నేపథ్యంలో సాగే సినిమానే మా లాల్ సలామ్ అని చెప్పింది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మాజీ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ కపిల్ దేవ్ ఈ మూవీలో ఒక పాత్రని పోషించడం విశేషం. జైలర్ హిట్ అయిన నేపథ్యంలో లాల్ సలామ్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |