![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే చాలు పవన్ ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు.థియేటర్ ని అందంగా అలంకరించడం దగ్గరనుంచి స్క్రీన్ మీద పవన్ కనపడే వరకు రచ్చ రచ్చ చేస్తుంటారు. తాజాగా పవన్ ఫ్యాన్స్ థియేటర్ లో చేసిన పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాలో పవన్ కళ్యాణ్ హీరోగా 2012 లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు రీ రీలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని చోట్ల కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతుంది.ఇంతవరకి బాగానే ఉంది కానీ ఒక థియేటర్ లో పవన్ ఫ్యాన్స్ థియేటర్ లోపల మంట పెట్టారు. తమ వెంట తెచ్చుకున్న పేపర్స్ తో మంట ఏర్పాటు చేసి ఆ మంట చుట్టు తిరుగుతు డాన్స్ చేసారు.దీంతో థియేటర్ యాజమాన్యం షో ని మధ్యలోనే ఆపివేసింది. అయినా సరే ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన అల్లరిని మాత్రం మానలేదు .సదరు ఘటనకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామాన్ గంగతో రాంబాబు జర్నలిజం ఎలాంటి విలువలని కలిగిఉండాలని చెప్పడంతో పాటుగా ప్రజలని రెచ్చగొట్టడానికి రాజకీయ నాయకులూ ఆడే డ్రామాలా గురించి కూడా చర్చించింది. పవన్ సరసన తమన్నా కథానాయికగా నటించగా కోట శ్రీనివాసరావు,ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.మణి శర్మ సంగీత సారథ్యంలో వచ్చిన పాటలు ప్రేక్షకులని బాగానే అలరించాయి.పవన్ సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో అప్పట్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని సంపాదించుకుంది.
![]() |
![]() |