![]() |
![]() |

'డీజే టిల్లు'తో బ్లాక్ బస్టర్ అందుకొని యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మార్చి 29న 'టిల్లు స్క్వేర్'తో పలకరించనున్నాడు. అలాగే నీరజ కోన డైరెక్షన్ లో 'తెలుసు కదా' అనే సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ని రివీల్ చేశారు మేకర్స్.
ఫిబ్రవరి 7న సిద్దు పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ని రివీల్ చేస్తూ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకి 'జాక్' అనే ఆసక్తికర టైటిల్ ని పెట్టారు. అంతేకాదు "కొంచెం క్రాక్" అంటూ క్యాచీ క్యాప్షన్ ను కూడా జోడించారు. మోషన్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. ఒక చేత్తో రియల్ గన్, మరో చేత్తో బొమ్మ గన్ పట్టుకొని.. సిద్ధు స్టైల్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా ఉంది. మోషన్ పోస్టర్ ని బట్టి చూస్తే.. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కి కూడా కొదవలేదని అర్థమవుతోంది.

'బొమ్మరిల్లు' వంటి క్లాసిక్ ఫిల్మ్ తో దర్శకుడిగా పరిచయమై, ఆ సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్న భాస్కర్.. 'పరుగు', 'ఆరెంజ్' వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. 2013 లో వచ్చిన 'ఒంగోలు గిత్త' తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఆయన.. 2021 లో 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్'తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. మరి ఇప్పుడు సిద్ధుతో చేస్తున్న 'జాక్'తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.
![]() |
![]() |