![]() |
![]() |

ఫలానా హీరో, హీరోయిన్ ప్రేమించుకున్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు రావడం సహజం. ఇద్దరు కలిసి ఒక్క సినిమాలో నటించినా చాలు.. ఇలాంటి వార్తలు గుప్పుమంటాయి. యంగ్ హీరో బెల్లంకొండ గణేష్, యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ విషయంలో ఇదే జరిగింది. వీరిద్దరూ కలిసి 'స్వాతిముత్యం' అనే సినిమాలో నటించారు. ఇంకేముంది గణేష్-వర్ష ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా వర్ష ఈ వార్తలను ఖండించింది.
వర్ష బొల్లమ్మ నటించిన లేటెస్ట్ మూవీ 'ఊరు పేరు భైరవకోన' ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వర్ష.. గణేష్ తో పెళ్లి వార్తలపై స్పందించింది. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.. కానీ మా విషయంలో నిప్పు లేకుండానే పొగ వస్తున్నట్లు ఉందని వర్ష అభిప్రాయపడింది. మేము తరచూ కలుస్తూ ఉంటేనో లేక సోషల్ మీడియాలో ఒకరి గురించి ఒకరు పోస్ట్ లు చేస్తూ ఉంటేనో.. ఇలాంటి వార్తలు వచ్చినా కాస్త అర్ధముంటుంది. కానీ అలాంటిదేం లేకుండానే మా గురించి వార్తలు రావడం ఆశ్చర్యం కలిగించింది. గణేష్ మంచి పర్సన్, మంచి ఫ్రెండ్.. అంతకుమించి మా మధ్య ఏం లేదని వర్ష చెప్పుకొచ్చింది.
![]() |
![]() |