Home

»

Latest News

34 ఏళ్ళ తర్వాత మళ్ళీ రానున్న సినిమా..ఆడోళ్లకి పండగే 

Feb 7, 2024 2:14PM

తొంభయ్యవ దశకంలో తెలుగు ప్రేక్షకులని భక్తి పారవశ్యంతో ముంచెత్తిన సినిమా శ్రావణ శుక్రవారం.ఒక రకంగా చెప్పాలంటే ఆ సంవత్సరం తెలుగు వారికి  భక్తి నామ సంవత్సరంగా కూడా మిగిలిపోయింది. అసలు  తొంభయ్యవ దశకంలో ఆ  సినిమాని చూడని ఆడవారు  ఉండేవారు కాదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

శ్రావణ శుక్రవారం..ఏప్రిల్ 6 1990 న  విడుదల అయిన ఆ మూవీలో ప్రముఖ నటి  సీత టైటిల్ రోల్ ని పోషించింది.  ఇప్పుడు ఈ మూవీ రీమేక్ అవ్వబోతుంది.అంటే శ్రావణ శుక్రవారం మళ్ళీ సరికొత్త నటులతో సరికొత్త టెక్నాలజీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్నీ శ్రావణ శుక్రవారం చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రసిద్ధ దర్శకులు దివంగత  రామ్ నారాయణ గారి  కొడుకు మురళి  వెల్లడించాడు. త్వరలోనే  రీమేక్ కి సంబంధించిన మరిన్నివిషయాలని వెల్లడి చేస్తామని  కూడా ఆయన చెప్పాడు.దీంతో ముప్పై నాలుగేళ్ళ తర్వాత రీమేక్  అవ్వబోతున్న సినిమాగా శ్రావణ శుక్రవారం రికార్డు సృష్టించింది.

అలాగే ఈ సినిమాలో సీత క్యారక్టర్ లో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అవన్నీ అబద్దాలని మురళి చెప్పాడు. కాకపోతే ఆ పాత్ర కోసం ఆమెని కూడా సంప్రదిస్తామని ఆయన  చెప్పాడు. డెవోషనల్ సినిమాల సృష్టికర్త  రామ్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన శ్రావణ శుక్రవారం  గ్రాఫిక్స్ లేని రోజుల్లోనే సూపర్ గా చిత్రీకరించబడింది. సీత తో పాటు నిళళ్ గల్ రవి, వై విజయ,ప్రదీప్ శక్తీ తదితరులు నటించారు. ఈ  సినిమాలోని పాటలు నేటికీ భక్తి కార్యక్రమాలప్పుడు మారుమోగిపోతుంటాయి. మరి  90 వ దశకంలో సంచలన విజయం సాధించిన శ్రావణ శుక్రవారం రీమేక్ లో కూడా సంచలన విజయాన్ని సాధిస్తుందో లేదో చూడాలి.తమిళంలో రూపొందిన ఆడివెళ్లి కి అనువాదంగా శ్రావణ శుక్రవారం తెలుగులోకి డబ్ అయ్యింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com