![]() |
![]() |

తమిళనాట ఇంకో పెను విప్లవం స్టార్ట్ అయ్యింది. ఎన్నో సినిమాల్లో అధ్బుతంగా నటించి కొన్ని లక్షల మంది అభిమాన గణాన్ని సంపాదించుకున్న తలపతి విజయ్(vijay) ఇప్పుడు సంచలనంగా మారాడు. మూడు దశాబ్దాల నుంచి తమిళ చిత్ర సీమలో విజయ్ అనే మూడక్షరాల పేరు చెప్తే చాలు తమిళ ప్రజలు ఆనందంతో పులకరించిపోతారు. అలాంటి విజయ్ ఇప్పుడు తమిళ ప్రజల కోసం ఒక డేరింగ్ నిర్ణయం తీసుకొని టాక్ అఫ్ ది ఇండియన్ మీడియాగా మారాడు
విజయ్ ఫ్యాన్స్ తో ఎప్పటినుంచో విజయ్ రాజకీయ పార్టీ స్థాపించాలని డిమాండ్ చేస్తు వస్తున్నారు.ఇప్పుడు వాళ్ళు ఎదురు చేస్తున్న రోజు రానే వచ్చింది. తమిళగ వెట్రి కజగం (Tamilaga Vettri Kazhagam) అనే రాజకీయ పార్టీని స్థాపిస్తున్నటుగా విజయ్ ప్రకటన చేసాడు. ఎలాంటి హడావిడి లేకుండా తన సోషల్ మీడియా ద్వారా విజయ్ చేసిన ఈ ప్రకటనతో ఒక్కసారిగా తమిళనాడు వ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రభుత్వాలు ప్రజలని తమ పబ్బం గడుపు కోవడం కోసం కులాలు మతాలు పేరుతో విడదీస్తున్నాయని ప్రజలందరినీ ఒక్కటిచేసి అవినీతి లేని పాలన అందించడమే తన పార్టీ లక్ష్యమని విజయ్ విజయ్ ఒక సుదీర్ఘమైన వివరణని కూడా ఇచ్చాడు. పార్టీ పేరుని ఎలక్షన్ కమిషన్ కి కూడా పంపించిన ఆయన అక్కడి నుంచి అనుమతి రాగానే పార్టీకి సంబంధించిన మిగతా కార్యక్రమాలు మొదలు పెడతారు. విజయ్ పార్టీ పేరు అయిన తమిళక వెట్రి కజగం కి తెలుగులో తమిళ విక్టరీ క్లబ్ అని అర్ధం.

10 సంవత్సరాల వయసులో బాలనటుడిగా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన విజయ్ కి సోలో హీరోగా సింధూర పండి అనే సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు.దేవా, విష్ణు, చంద్రలేఖ, పూవే ఉనక్కగా, వసంత వాసై, సెల్వ, లవ్ టుడే,ప్రియ ముదన్, తుళ్ళుదా మనామం తుళ్లుద్, నెంజినిలే, ఖుషి, ప్రియ మన్నా వళై, బద్రి, ఫ్రెండ్స్ తిరుమలై .గిల్లి, శివ కాసి.పొక్కిరి, వేలాయుధం, తుపాకీ, జిల్లా ,తేరి, మెర్సిల్ ,బిగిల్ ,మాస్టర్, సర్కార్ ,వారిసు రీసెంట్ గా లియో ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారక్టర్స్ చేసి తమిళ ప్రేక్షకుల ఆరాధ్య కథానాయకుడుగా మారాడు.
![]() |
![]() |